మెగాస్టార్ కి వసైపోయిందా.. ఎవరు చెప్పారు. వాల్తేర్ వీరయ్య లో చిరంజీవి మాస్ స్టెప్స్ చూస్తే మరో 20 ఏళ్ళు వయసు ఆయనకి తగ్గింది అని మెగా అభిమానులు కాదు.. సాధారణ ప్రేక్షకుడు కూడా యునానమస్ గా చెబుతున్న మాట. మేము మెగా అభిమానులం కాదు, అలా అని ఎవరికీ అభిమానులం కాదు. మేము సినిమాలు చూస్తాము. బావుంది అంటే బావుంది, లేదంటే లేదు అని చెప్పే గట్స్ మాకున్నాయి. కానీ సినిమా బావున్నా దానిని కిల్ చేసే సంసృతి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి చేటు చేసేదిలా తయారైంది. ఒక పక్క మెగాస్టార్ భజన చేస్తూ బ్రతికే వాళ్ళే ఈనాడు ఆయన్ని మరో పక్క విమర్శిస్తున్నారు. పిలిచి ఇంటర్వ్యూ ఇస్తే.. ఇంటర్వ్యూ లో ఆయన ముందు చేతులు కట్టుకున్న వారే.. బయటికి వచ్చాక ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇంటర్వ్యూ చేసినప్పుడే.. మీరు సినిమాలు మానెయ్యండి, కొత్త స్టార్స్ వస్తారు, మీరు ఒకప్పుడు మెగా స్టార్.. ఇప్పుడు కాదు. ఇంకా మీరు ఇండస్ట్రీ నెంబర్ వన్ అనుకుంటున్నారా అని అడిగే దమ్ము లేని వాళ్ళు బయటికొచ్చాక ఆయనపై విమర్శలు చెయ్యడం ఎంతవరకు సబబు.. అంటే ఏరు దాటాక తెప్ప తగలేసే బుద్ది మీది అనే సామెత ఆపాదించాల్సి వస్తుంది. చిరంజీవి గారు మీరు సినిమాలు మానెయ్యండి అని చెప్పడానికి మీరెవరు, చిరు సినిమా నచ్చకపోతే చూడడం మానెయ్యి. ఆయన సినిమాలు చేస్తుంటే నిర్మాతలకు డబ్బులు బాగానే వస్తున్నాయి. ఒకవేళ చిరంజీవి సినిమా ఎవరూ చూడకపోతే ఆయన సినిమాలకు రెవిన్యూ రాదు. ప్రేక్షకులు చూడడం లేదని తెలిస్తే ఏ ఒక్క నిర్మాతా ఆయనతో సినిమాలు చెయ్యడానికి ముందుకు రారు.
చిరు సినిమాలు ప్రేక్షకులు ఆదరించకపోతే ఏ నిర్మాత మాత్రం డబ్బు వృధా చేసుకుంటాడు.? ఆడియన్స్ ఆయన సినిమాలని ఇంకా ఆదరిస్తున్నారు కాబట్టే నిర్మాతలు సినిమాలు చేసుకుంటున్నారు. నీకు నచ్చలేదని ఆయన సినిమా చెయ్యడం మానెయ్యాలా..? రిటైడ్ అవ్వాలా..? అది ఆయనకి తెలియదా..? మీరు చెప్పాలా..? అసలు చిరు పక్కన డాన్స్ చెయ్యడానికి హీరోయిన్స్ కి లేని బాధ నీకెందుకు ? చిరంజీవి వాల్తేర్ వీరయ్యలో ఓ పిల్లా సాంగ్ లో వేసిన స్టెప్స్ కానివ్వండి, ఆయన ఎక్సప్రెషన్స్ కానివ్వండి అన్నీ నిజంగా అద్భుతః అన్న రేంజ్ లో ఉన్నాయి. మెగాస్టార్ ఒక్కప్పుడు ఇండస్ట్రీ నెంబర్ వన్. కానీ ఇప్పుడు కూడా ఆయనకి ఓ మంచి కథ పడితే ఎలా ఉంటుందో చూపిస్తారు. సినిమాలు చేస్తారు, తద్వారా నలుగురికి సహాయం చేస్తారు.. అదే ఆయనకి తెలిసింది.
చిరంజీవి ఒక్క సినిమా చేస్తే వందల మందికి ఉపాధి దొరుకుతుంది. ఆపదలో ఉండి మెగాస్టార్ ను సహాయం కోరిన వాళ్ళకి కాదనకుండా హెల్ప్ చేస్తారు. ఆయన్ని విమర్శించే స్థాయా మీది.? తప్పు చేస్తే చెప్పు.. ఆయన తీరుమార్చుకుంటారు. కానీ తప్పులేకుండా నీ అభిప్రాయాన్ని ఒకళ్ళ మీద రుద్దకు.. ఇదే నీకు చెప్పేది అంటూ సినిమా అభిమానులు సినిమా ఇండస్ట్రీలోని ఓ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.