కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న సమంత మళ్ళీ యాక్టీవ్ అవుతుంది. మాయోసైటిస్ తో చికిత్స తీసుకుంటూ కొద్దినెలలుగా రెస్ట్ లో ఉన్న సమంత శాకుంతలం ట్రైలర్ లాంచ్ లో పాల్గొంది. అక్కడ కూడా సమంత ఆరోగ్యంగా కనిపించలేదు. కాస్త అన్ ఈజీగా వున్న ఆమె రీసెంట్ గా సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది. గతంలో ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా తన అనుభవాలను, ఆలోచనలను, తన ఫీలింగ్స్ ని షేర్ చేసే సామ్ ఇప్పుడు మాత్రం కామ్ గా ఉంటుంది కానీ.. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ లు పెట్టకపోయేసరికి ఆమె అభిమానులు డిస్పాయింట్ అవుతున్నారు.
తాజాగా సమంత సోషల్ మీడియాలో తన క్యూట్ పెట్ హాష్ తన వీపు పై కాలు పెట్టి ఉన్న పిక్ ని షేర్ చేసింది. ఆ పిక్ తో పాటుగా బాధపడకు మమ్మీ... నీకు నేనున్నాగా! అని తన పెంపుడు కుక్క హాష్ తనని ఓదార్చుతున్నట్టుగా క్యాప్షన్ పెట్టింది. సమంత సోఫాలో వెల్లకిలా పడుకోగా.. సమంత పెంపుడు కుక్క సమంత వీపు మీద కాలుపెట్టింది. సమంత పెట్టిన పోస్ట్ నిమిషాల్లో వైరల్ అయ్యింది. అసలే సోషల్ మీడియా క్వీన్. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో సమంత పోస్ట్ ల కోసం ఫాన్స్ వెయిటింగ్. అందుకే ఆమె ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంది.