జబర్దస్త్ యాంకర్ గా అందరి అభిమానం పొంది.. ప్రస్తుతం జబర్దస్త్ నుండి బ్రేక్ తీసుకున్న అనసూయ తనని కామెంట్ చేసేవారిని ఎవ్వరినీ వదలదు. తాను ఏం అనుకున్నా ధైర్యంగా చెప్పగలిగే ఈ హాట్ యాంకర్ జబర్దస్త్ వదిలేసాక అంతగా పబ్లిక్ లో కనిపించడం లేదు. సినిమా షూటింగ్స్ అంటుంది కానీ.. ఎప్పుడూ బిజీగా కనబడలేదు. అనసూయ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటుంది. ఈమధ్యన కాస్త బరువు పెరిగినా ఇప్పటికీ అదే గ్లామర్ ని మెయింటింగ్ చేస్తుంది. సారీస్ అయినా, చుడి దార్లు అయినా ఏదైనా అందాలను ఆరబోస్తూ ఫోటో షూట్ చేయించి మరీ వదులుతుంది.
అయితే అనసూయని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేసే వారి బెండు తీస్తుంది. సోషల్ మీడియా లో జోష్ లో ఉండే అనసూయ తాజాగా ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియో లో తానొక డిజార్డర్ తో బాధపడుతున్నట్టుగా చెప్పి షాకిచ్చింది. అదేమిటంటే నా గురించి నెగెటివ్ గా మాట్లాడేవారిని అస్సలు లెక్కచెయ్యను, వారిని పట్టించుకోకపోవడమే నాకున్న అతి పెద్ద రుగ్మత అంటూ అనసూయ షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
ఆ వీడియో చూసిన నెటిజెన్స్.. అమ్మో అనసూయ ఇంకేదో డిసీస్ బయటపెడుతుంది అనుకున్నాం.. ఇదేనా ఆమె రుగ్మత అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.