నితిన్ మాచర్ల నియోజకవర్గం మూవీ డిసాస్టర్ అవ్వడంతో కామ్ గా కొద్దిగా గ్యాప్ తీసుకుని వక్కంతం వంశీ దర్శకత్వంలో కొత్త సినిమాని పట్టాలెక్కించేసాడు. ఈ చిత్రంలో నితిన్ కి జోడిగా ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న శ్రీలీల నటిస్తుంది. నితిన్-శ్రీలీల జంట కొత్త కాంబినేషన్ కి శ్రీకారం చుట్టింది. అయితే మూడేళ్ళ క్రితం వెంకీ కుడుములు దర్శకత్వంలో నితిన్ భీష్మ చిత్రం చేసాడు. ఈ చిత్రంలో నితిన్ కి జంటగా రష్మిక నటించింది.
ఆ చిత్రంలో నితిన్-రష్మిక జోడీలకి మంచి మార్కులే పడ్డాయి. రష్మిక క్యూట్ లుక్స్ తో ట్రెడిషనల్ గా కనిపించినా.. సాంగ్స్ లో గ్లామర్ షో చేసింది. అయితే ఇప్పుడు ఈ జంట మరోసారి కలిసి నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా వెంకీ కుడుములు దర్శకత్వంలో నితిన్-రష్మిక జోడి కట్టబోతున్నారని అంటున్నారు. భీష్మ తర్వాత ఇంతవరకు ఏ హీరో తో సినిమా మొదలు పెట్టని వెంకీ కుడుములు మెగాస్టార్ కి కథ చెప్పి సినిమా కమిట్ చేయించినా అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో తెలియక సతమతమవుతున్నాడు.
దానితో మరోసారి వెంకీ కుడుములు నితిన్ తోనే సెట్స్ మీదకి వెళ్లాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వెంకీ కుడుములు-నితిన్ ప్రాజెక్ట్ పై త్వరలోనే అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఈ చిత్రం కోసం రష్మిక ని హీరోయిన్ గా సంప్రదించాలని మేకర్స్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది.