Advertisementt

VD12 పై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ

Fri 13th Jan 2023 07:23 PM
vijay devarakonda,gowtam tinnanuri  VD12 పై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ
Vijay Deverakonda to team up with Jersey director Gowtam Tinnanuri VD12 పై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని రూపొందించనుంది. విజయ్ కెరీర్ లో 12వ సినిమాగా తెరకెక్కనుంది. తెలుగు, హిందీ పరిశ్రమలలో ప్రతిభగల దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి నిరూపించుకున్నారు. 2019లో ఆయన దర్శకత్వంలో వచ్చిన జెర్సీ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది.  గౌతమ్ ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేతులు కలిపారు. వీరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆ అంచనాలను అధిగమించి, అందరినీ అలరించే చిత్రం అందిస్తామని చిత్ర నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ఇది భూమి బద్దలై పోయేది, అత్యంత భారీగా ఉంటుందని తాము చెప్పట్లేదు.. కానీ అద్భుతమైన విషయం అని మాత్రం చెప్పగలమని నిర్మాత నాగవంశీ అన్నారు. 

అర్జున్ రెడ్డి, గీత గోవిందం, పెళ్లి చూపులు వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకొని విజయ్ దేవరకొండ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రంతో ఆయనలోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తానని దర్శకుడు అంటున్నారు. ఎందరో నటీనటులతో పనిచేస్తూ ఎన్నో నాణ్యమైన చిత్రాలను అందిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మొదటిసారి విజయ్‌తో జత కట్టడంతో ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది. 

చిత్ర ప్రకటన సందర్భంగా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ఓ వ్యక్తి పోలీసు దుస్తుల్లో ముఖానికి ముసుగు ధరించి గూఢచారి ని తలపిస్తున్నాడు. పోస్టర్ మీద I don't know where I belong, to tell you whom I betrayed - Anonymous Spy అని రాసుండటం గమనించవచ్చు. ఇదొక స్పై ఫిల్మ్ అని పోస్టర్ ని బట్టి అర్థమవుతోంది. అలాగే సముద్రతీరంలో యుద్ధ సన్నివేశాన్ని తలపించేలా మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో పోస్టర్ ను ఆసక్తి రేకెత్తించేలా రూపొందించారు.

ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. 

Vijay Deverakonda to team up with Jersey director Gowtam Tinnanuri:

Vijay Devarakonda Next Film With Jersey Director Gowtam Tinnanuri 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ