Advertisementt

వాల్తేర్ వీరయ్య ఓటిటి పార్ట్నర్ రివీల్డ్

Fri 13th Jan 2023 04:17 PM
waltair veerayya  వాల్తేర్ వీరయ్య ఓటిటి పార్ట్నర్ రివీల్డ్
Waltair veerayya OTT partner revealed వాల్తేర్ వీరయ్య ఓటిటి పార్ట్నర్ రివీల్డ్
Advertisement
Ads by CJ

మెగాస్టార్-మాస్ మహారాజ రవితేజ కలయికలో కొల్లి బాబీ తెరకెక్కించిన వాల్తేర్ వీరయ్య సినిమా రిలీజ్ తో మాస్ ఆడియన్స్ కి పూనకలొచ్చేస్తుంటే.. థియేటర్స్ మెగా ఫాన్స్ విజిల్స్ తో మోత మోగిపోతుంది. పూనకాలు లోడింగ్ అంటూ మెగాస్టార్ రచ్చకి మాస్ ఆడియన్స్ చేసిన హంగామాతో ఈరోజు వాల్తేర్ వీరయ్య థియేటర్స్ దగ్గర జాతరని తలపించింది. నేడు ఆడియన్స్ ముందుకు వచ్చిన వాల్తేర్ వీరయ్యని మాస్ ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ మిక్స్డ్ టాక్ ఇస్తున్నా.. వాల్తేర్ వీరయ్యకి మాస్ ఫాన్స్ మాత్రం బ్రహ్మరధం పడుతున్నారు.

ఈ పండగ విన్నర్ వాల్తేర్ వీరయ్య అంటూ మెగా ఫాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. రవితేజ కేరెక్టర్ సినిమాకి ప్లస్ అవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సంక్రాంతికి వాల్తేర్ వీరయ్యనే లైక్ చేస్తారనిపిస్తుంది. మరి రేపు వారసుడు కూడా దిగిపోతే.. ఫైనల్ గా సంక్రాతి విన్నర్ ఎవరో తేలిపోతుంది. అయితే థియేటర్స్ లో పూనకాలు తెప్పిస్తున్న వాల్తేర్ వీరయ్య ఓటిటి పార్ట్నర్ రివీల్ అయ్యింది. వాల్తేర్ వీరయ్యని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. వాల్తేర్ వీరయ్య నెట్ ఫ్లిక్స్ ఓటిటి ద్వారా విడుదలకాబోతుంది. అయితే ఎనిమిది వారాల తర్వాతే వాల్తేర్ వీరయ్య ఓటిటి రిలీజ్ ఉండొచ్చు. 

Waltair veerayya OTT partner revealed:

Official: Waltair Veerayya Seals OTT Partner

Tags:   WALTAIR VEERAYYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ