మెగాస్టార్ మాస్ మూవీ వాల్తేర్ వీరయ్య నేడు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైంది. చిరంజీవి మాస్ లుక్స్, చిరు డాన్స్ స్టెప్స్, రవితేజ సినిమాలో యాడ్ అవడం అన్నీ వాల్తేర్ వీరయ్య పై విపరీతమైన హైప్ క్రియేట్ అవ్వడానికి కారణమయ్యాయి. వాల్తేర్ వీరయ్య తో చిరంజీవి దుమ్మురేపడం ఖాయమని మెగా ఫాన్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. గ్యాంగ్ లీడర్ రోజులని గుర్తుకు తెస్తూ మెగాస్టార్ పూనకాలు లోడింగ్ అంటూ రవితేజతో కలిసి జాతరకు దిగిపోయారు. ఇప్పటికే ఓవర్సీస్ లో షోస్ కంప్లీట్ అవడం, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెషల్ షోస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవడంతో పబ్లిక్ సోషల్ మీడియా వేదికగా వాల్తేర్ వీరయ్య టాక్ ని స్ప్రెడ్ చేస్తూ సినిమా ఆలా ఉంది, ఇలా ఉంది అంటూ హడావిడి మొదలు పెట్టారు.
వాల్తేర్ వీరయ్య ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. మెగాస్టార్ మాస్ లుక్స్, ఆయన ఎనర్జిటిక్ పెరఫార్మెన్స్, బాస్ డాన్స్, యాక్షన్ సీక్వెన్స్, దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్ అన్నీ వాల్తేర్ వీరయ్య లో ప్లస్ పాయింట్స్ అంటూ మెగా ఫాన్స్ మాత్రమే కాదు నెటిజన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ర్యాంపేజ్ అంటూ ఏనుగుపై చిరంజీవి నిలబడిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హంగామా చేస్తున్నారు. రవితేజ, చిరంజీవి మధ్య సన్నివేశాలు పవర్‌పుల్‌గా ఉన్నాయి. శృతిహాసన్ గ్లామర్ పరంగాను, చిరు తో కలిసి సాంగ్స్ లో స్టెప్పులతో ఆలరించింది. ఆమె కేరెక్టర్ కి మంచి స్కోప్ ఉంది అంటూ ట్వీట్స్ వేస్తున్నారు.
వింటేజ్ లుక్‌లో చిరంజీవి డాన్సులు, కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ లుక్స్ బావున్నాయి. ఇక డాన్సులు గురించి, పాటలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అంటున్నారు. కొంతమంది రొటీన్ కమర్షియల్ మూవీనే అంటూ పెదవి విరుస్తున్నారు. కామెడీ బావున్నా ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అవ్వలేదు అంటున్నారు. ఎక్కువ శాతంమంది మెగా ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ అంటూ పబ్లిక్ తమ టాక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.