దిల్ రాజు సినిమాల విషయంలో చాలా కాలిక్యులేటెడ్ గా ఉంటాడు. ఎన్నో ఆలోచించి ఆయన సినిమాని నిర్మిస్తాడు. ఒక్కోసారి దిల్ రాజు లెక్క తప్పి నెత్తి బొప్పికట్టిన సందర్భాలను దిల్ రాజే స్వయంగా బయటపెట్టాడు. అజ్ఞాతవాసి, స్పైడర్ చిత్రాల విషయంలో తానెంతగా నష్టపోయాడో అనే విషయాన్ని ఈమధ్యనే రివీల్ చేసాడు. పెద్ద హీరోలతో సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో ఆయనకి పూర్తిగా అర్ధమైంది. అయినా నిర్మాత కదా అందుకే సినిమాలు చెయ్యకుండా ఉండలేదు. తాజాగా దిల్ రాజు కోలీవుడ్ హీరో విజయ్ తో వారసుడు/వారిసు చిత్రాన్ని నిర్మించాడు. వారిసు పై దిల్ రాజు చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
తెలుగులో విజయ్ మార్కెట్ ఎలా ఉన్నా.. తమిళ్ లో విజయ్ మర్కెట్ ని నమ్మి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. అయితే తమిళ్ లో భారీగా ప్రమోట్ చేసిన దిల్ రాజు తెలుగులో గట్టిగా ఆడియన్స్ లోకి తీసుకెళ్లలేకపోయాడు. అసలే చిరు-బాలయ్య సినిమాల మోత. గట్టి ప్రమోషన్స్ లేకపోతే విషయం మాములుగా ఉండదు. తమిళ్ లో విజయ్ తో కలిసి సినిమాని ప్రమోట్ చేసిన దిల్ రాజు తెలుగులో ప్రమోషన్స్ కోసం విజయ్ ని రప్పించలేకపోయాడు. ఇక్కడ తెలుగు నటులతో ఇంటర్వూస్, రిలీజ్ ప్రెస్ మీట్స్ అంటూ హడావిడి చేస్తున్నాడు.
కానీ హీరో విజయ్ ని తీసుకొచ్చి ఓ ఈవెంట్ చేసినా, లేదంటే ఓ ఇంటర్వ్యూ ఇప్పించినా వారసుడిపై ఆడియన్స్ లో క్రేజ్, హైప్ క్రియేట్ అవుతుంది. ఎంతైనా హీరోలు కదా.. సినిమాలని ప్రమోట్ చేస్తే వేరే లెవల్ అంచనాలు క్రియేట్ అవుతాయి. కానీ ఎంతో ముందు చూపుతో వర్క్ చేసే దిల్ రాజు కూడా విజయ్ ని ప్రమోషన్స్ కోసం రప్పించలేకపోయాడు. శనివారం భోగి సందర్భంగా వారసుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి విజయ్ ఎందుకు వారసుడు ప్రమోషన్స్ స్కిప్ చేసాడో దిల్ రాజుకే తెలియాలి.