బాలీవుడ్ లో గత ఏడాది అలియా భట్-రణబీర్ కపూర్ ల వివాహం చాలా సింపుల్ గా ఎలాంటి హడావిడి లేకుండా జరిగిపోయింది. కనీసం పెళ్ళికి పిలవడం కానీ, లేదంటే సెలబ్రిటీస్ కి రిసెప్షన్ కూడా ఇవ్వకుండా అలియా భట్-రణబీర్ లు కామ్ గా జంటగా మారిపోయారు. అయితే ఈ ఏడాది కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాల పెళ్లి భాజాలు మోగబోతున్నాయని, ఇప్పటికే పెళ్లి ఐర్పాట్లు జరిగిపోతున్నాయంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ జంట విషయమేమో కానీ.. మరో బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతుంది.
ఆమె సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న అతియా శెట్టి ఇప్పుడు పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యింది. సునీల్ శెట్టి అతియా-రాహుల్ ల వివాహాన్ని ఖండాలాలో ప్లాన్ చేసారు. పెళ్లి తేదీపై ప్రకటన రాకపోయినా.. అతియా శెట్టి-KL రాహుల్ ల వివాహం జనవరి 23 అంటే ఈనెలలోనే జరగబోతున్నట్టుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఖండాలాలోని సునీల్ శెట్టి కి సంబందించిన బంగ్లాలోనే మూడురోజుల పాటు ఈ పెళ్లి కి సంబందించిన ఫంక్షన్స్ జరగబోతున్నాయని తెలుస్తుంది.
ఈ పెళ్ళికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటుగా, క్రికెటర్స్ కూడా హాజరవుతారని, కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యన జనవరి 23 న అతియా వివాహం రాహుల్ తో అంగరంగ వైభవంగా జరగబోతున్నట్లుగా తెలుస్తుంది.