ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ టీమ్ అమెరికా లాస్ ఏంజిల్స్ లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో భాగంగా నాటు నాటు పాటకి అవార్డు దక్కించుకుని ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తుంది. ట్రిపుల్ ఆర్ లోని నాటు నాటు పాటకు ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై దేశ వ్యాప్తంగా ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీస్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసనతో అమెరికా వెళ్లగా, రాజమౌళి, కీరవాణి భార్యలతో సహా ఆ బెస్ట్ మూమెంట్ ని ఎంజాయ్ చేసారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడో భార్యాపిల్లలతో కలిసి అమెరికా ట్రిప్ వేసాడు. అయితే రామ్ చరణ్ భార్య ఉపాసన రీసెంట్ గా ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని మెగా ఫ్యామిలీ అఫీషియల్ గా ప్రకటించింది.
అక్కడ అమెరికాలో ట్రిపుల్ ఆర్ టీమ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై ఉపాసన టీమ్ ని రామ్ చరణ్ అభిందించడమే కాదు ఎమోషనల్ గా పోస్ట్ కూడా పెట్టింది. అది ఆర్.ఆర్.ఆర్ ఫ్యామిలిలో నేనూ భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది దేశం గర్వించే విజయం. ఈ ప్రయాణంలో నన్ను భాగస్వామిని చేసిన రామ్ చరణ్, అలాగే దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు. నాతో కలిసి నా బేబీ (పుట్టబోయే బిడ్డ) కూడా ఈ ఆనందాన్ని, అనుభూతిని పొందుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. చాలా ఉద్వేగంగా కూడా ఉంది అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.