గత ఏడాది చాలామంది హీరోయిన్స్ తమకున్న సమస్యలని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే వాళ్ళకి పెద్ద ఎత్తున అభిమానుల నుండి, స్నేహితుల నుండి, సన్నిహితుల నుండి మద్దతు లభించింది. టాప్ హీరోయిన్ సమంత యశోద ప్రమోషన్స్ సమయంలో తనకి మాయోసైటిస్ అనే వ్యాధి ఉంది అంటూ షాకిచ్చింది. అప్పుడు సమంత త్వరగా కోలుకోవాలంటూ చాలామంది మెసేజ్ చేసారు. నటి పూనమ్ కౌర్, హీరోయిన్ శృతి హాసన్, ఇంకా నటి కల్పికా గణేష్ ఇలా చాలామంది రకరకాల సమస్యలతో సమతమవుతున్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేసారు. శృతి హాసన్ అయితే పీరియడ్స్ విషయాన్ని కూడా దాచుకోకుండా షేర్ చేస్తుంది.
అయితే శృతి హాసన్ ఇప్పుడు తాను మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్నాను అంటూ బాంబు పేల్చింది. మానసికంగా కొన్ని సమస్యలున్నాయని, ఉన్నట్టుండి కోపం రావడం, కొన్ని విషయాల్లో బ్యాలెన్స్ కోల్పోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టుగా చెబుతుంది. ఇలాంటివి బయటికి చెప్పుకోవడానికి మొదట్లో చాలా భయపడ్డాను, కానీ ఇలాంటివి చాలామంది ఫేస్ చేస్తుంటారు. అందుకే ఓపెన్ గా చెబుతున్నా. ప్రస్తుతం మానసిక రుగ్మతకు చీకిత్స తీసుకుంటున్నాను, అలాగే మ్యూజిక్ థెరపీ చేస్తున్నాను.
నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరక్కపోతే అది ఇంట్లో అయినా, షూటింగ్ స్పాట్ లో అయినా సహనం కోల్పోయి అరిచేస్తాను. ఈ రుగ్మత ఎక్కువగా అనిపించడంతో నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ వెంటనే థెరపీకి వెళ్ళిపోయాను. ఏదైనా సమస్య దాచాలనుకుంటే అది మరింత ఎక్కువవుతుంది. కాబట్టి అన్నీ మనసు విప్పి చెప్పుకోండి, కొంతైనా మనశాంతి దొరుకుతుంది అంటూ శృతి హాసన్ తన వ్యాధిని బయటపెట్టింది.