ఈ సంక్రాంతికి విడుదలవుతున్న మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య-బాలకృష్ణ వీర సింహ రెడ్డిల మాస్ జాతరలో మాస్ ఆడియన్స్ ఊగిపోతున్నారు. ఈ పొంగల్ కి ఈ సీనియర్ హీరోలిద్దరూ నువ్వా-నేనా అని పోటీపడుతుంటే.. నందమూరి-మెగా అభిమానులు సోషల్ మీడియాలో #VeeraSimhaReddy, #WaltairVeerayya ల హాష్ టాగ్స్ తో రచ్చ మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు చిరు-బాలయ్య మధ్యలో ప్రభాస్ అన్నట్టుగా ప్రభాస్ ఫాన్స్ కూడా సోషల్ మీడియాలో హంగామా మొదలు పెట్టారు. కారణం ప్రభాస్ ఆదిపురుష్ మాములుగా ముందు చెప్పిన డేట్ జనవరి 12, 2023 నే విడుదల కావాల్సి ఉంది. అంటే ఈ రోజే అన్నమాట ఆదిపురుష్ విడుదల కావాల్సింది. ఆదిపురుష్ విడుదలైతే ప్రభాస్ ఫాన్స్ ఊగిపోయేవారు. ప్రభాస్ కటౌట్స్, స్పెషల్ ప్రీమియర్స్ తో రచ్చ చేసేవారు.
అందుకే ప్రభాస్ ఫాన్స్ #Adipurush హాష్ టాగ్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. చిరంజీవి వాల్తేర్ వీరయ్య-బాలకృష్ణ వీర సింహ రెడ్డి హాష్ టాగ్స్ మధ్యన ఆదిపురుష్ హాష్ టాగ్ ట్విట్టర్ లో చక్కర్లు కొడుతోంది. అంటే ప్రభాస్ ఫాన్స్ ఈరోజుని ఆదిపురుష్ రిలీజ్ తో సెలెబ్రేట్ చేసుకోవాల్సింది. కానీ అది పోస్ట్ పోన్ అవడంతో వారి ఉనికిని చాటుకోవడానికి ఇలా సోషల్ మీడియాలో హంగామా చేస్తూ ఆదిపురుష్ హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో #VeeraSimhaReddy, #WaltairVeerayya , #Adipurush హాష్ టాగ్స్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ ఆవుతున్నాయి. బాలయ్య ఫాన్స్, మెగా ఫాన్స్ మధ్యలో ప్రభాస్ అన్న రేంజ్ లో సోషల్ మీడియా కళకళలాడుతుంది.