Advertisementt

కూతురిని మిస్ అవుతున్న చిరు చిన్నల్లుడు

Wed 11th Jan 2023 10:44 PM
kalyaan dhev  కూతురిని మిస్ అవుతున్న చిరు చిన్నల్లుడు
Kalyan Dhev Shared an emotional post కూతురిని మిస్ అవుతున్న చిరు చిన్నల్లుడు
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ నుండి కూడా విడిపోయి ఒంటరిగా ఫ్యామిలీతో కలిసి ఉంటుంది. మొదటి భర్తకి ఒక కూతురు రెండో భర్తకి ఒక కూతురు ఉండడంతో.. శ్రీజ ఇద్దరి కుమార్తెలని తన వద్దే ఉంచేసుకుంది. మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ సెలెబ్రిటీ కాదు కాబట్టి అతని విషయాలేవీ సోషల్ మీడియాలో కనిపించలేదు. శ్రీజని వివాహం చేసుకున్న కళ్యాణ్ దేవ్ హీరో అవతారమెత్తాడు. సో అతనిపై అందరి ఫోకస్ ఉంది. కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో వేసే ప్రతి పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ న్యూ ఇయర్ కి శ్రీజ తానొక వ్యక్తిని కలిశానని, ఆ వ్యక్తి తనకిచ్చిన భరోసా తనని ముందుకు నడిపిస్తుంది అంటూ తన జీవితంలోకి మరో వ్యక్తి వచ్చినట్టుగా కన్ఫ్యూజ్ చేసిన శ్రీజ అలా ఎందుకు పోస్ట్ పెట్టిందో కొంతమందికే అర్ధమైంది. అది శ్రీజ తనతో తానే ప్రయాణం చేస్తున్నట్లుగా ఆ పోస్ట్ పెట్టింది. అదలాఉంటే శ్రీజ-కళ్యాణ్ దేవ్ కూతురు నివిష్క బర్త్ డే కి కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో విష్ చేస్తూ ఉంటాడు. తాజాగా నివిష్క వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో నివిష్క చేసే అల్లరి, చిలిపిపనులు ఉన్నాయి.

అయితే నివిష్క వీడియో చూసిన కళ్యాణ్ దేవ్ నిన్ను బాగా మిస్ అవుతున్నారా అంటూ ఎమోషనల్ గా నివిష్క ని ఉద్దేశించి పోస్ట్ పెట్టాడు. అంటే కళ్యాణ్ దేవ్-శ్రీజ అఫీషియల్ గా విడిపోవడంతోనే కళ్యాణ్ దేవ్ కూతురిని మిస్ అవుతున్నాడని ఇప్పుడు పూర్తిగా అర్ధమైంది. అసలు శ్రీజ-కళ్యాణ్ దేవ్ లు విడాకులు తీసుకున్న విషయం ఇంతవరకు మెగా ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆ కన్ఫ్యూజన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. 

Kalyan Dhev Shared an emotional post:

Kalyaan Dhev pens emotional post on his daughter

Tags:   KALYAAN DHEV
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ