రష్మిక ఈ ఏడాది వారిసు సినిమాతో మొదలు పెట్టింది. గత ఏడాది బాలీవుడ్ ఎంట్రీ అనుకున్నంత గొప్పగా లేకపోయినా.. ఈ ఏడాది మాత్రం రష్మిక బాలీవుడ్ లో క్రేజీగా పాగా వెయ్యడానికి సిద్ధమైంది. ప్రస్తుతం మిషన్ మజ్ను ప్రమోషన్స్ లో గ్లామర్ గా అందాలు చూపిస్తూ.. అందరిని ఆకట్టుకుంటున్న రష్మిక.. తమిళ్ లో వారిసు కొచ్చిన టాక్ తో హ్యాపీగా ఉంది. విజయ్ తో తమిళ్ లో నటించిన వారిసు పొంగల్ సందర్భంగా ఈరోజు బుధవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. పుష్పతో పాన్ ఇండియా హిట్ కొట్టి.. పార్ట్ 2 షూటింగ్ కి రెడీ అవుతుంది. సంక్రాంతి వెళ్ళగానే పుష్ప షూటింగ్ లో పాల్గొంటుంది.
అయితే ఈ క్యూటీ నేషనల్ క్రష్ రశ్మికకి తన ఇంట్లో ఓ ముద్దు పేరు ఉందట. సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసిన రశ్మికని అభిమానులు మీకు నిక్ నేమ్ ఉందా.. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏమని పిలుస్తారు అంటూ అడగగా.. దానికి రష్మిక తనని తన ఫ్యామిలీ మెంబెర్స్ ప్రేమగా మోని లేదా మోవా అని పిలుస్తారు. మోవ అంటే కూతురు అని అర్ధమట. ప్రస్తుతం రష్మిక ఎక్కువగా ముంబైలోనే ఉంటుంది. అక్కడ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో యానిమల్ షూటింగ్, మిషన్ మజ్ను ప్రమోషన్స్ తో బిజీగా ఉంటుంది.