మెగా ఫ్యామిలిలో లుకలుకలు, మెగా-అల్లు కుటుంబాల మధ్యన గొడవలు అంటూ మీడియాలో తరుచు వినిపించే వార్తలు. అసలు మెగా ఫ్యామిలిలో ఏం జరుగుతుందో.. ఎవరెవరు కలిసి ఉన్నారో.. ఎవరెవరు విడిపోతున్నారో, ఎవరు గొడవపడుతున్నారో అనేది మీడియా మెగా ఫ్యామిలీ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ కదా.. ఎక్కువమంది హీరోలు ఉన్నారు, వాళ్ళ మధ్యలో కాంపిటేషన్ కూడా ఉంటుంది. అందుకే వాళ్ళ మధ్యన ఎమన్నా గొడవలున్నాయేమో అనేది మీడియా తొంగి చూస్తుంది. ముఖ్యంగా అల్లు-కొణిదెల ఫ్యామిలీ మధ్యన ఏదో ఒక సన్నని గీత ఉంది, బావాబావమరుదులు కృష్ణార్జునులులా ఉంటారు, కానీ ఇప్పుడు ఆ బాండింగ్ మిస్ అయ్యింది అనుకుంటున్నారు.
ఆ విషయంలో అల్లు అరవింద్ మొన్నామధ్యన మెగా ఫ్యామిలిలో ఎలాంటి గొడవ లేదు. ఒకే ఫ్యామిలిలో హీరోలంటే కాంపిటీషన్ ఉండకూడదా.. ఒకే ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన పోటీ ఉండడం సహజం. మా మధ్యన అదే ఉంది అని.. మా ఫామిలీస్ మధ్యన ఎలాంటి గొడవ లేదని తేల్చేసారు.
తాజాగా మెగాస్టార్ కూడా మరోసారి మెగా-అల్లు ఫ్యామిలీల మధ్యన విభేదాలపై ఎదురైన ప్రశ్నకు పూర్తి క్లారిటీ ఇచ్చారు. అల్లు అరవింద్ బర్త్ డే కి ఇప్పటికి వాళ్ళంటికి వెళతాము, మా ఇంట్లో పండగలు, పార్టీలు కలిసే చేసుకుంటాము, మొన్నటికి మొన్న క్రిష్టమస్ సెలెబ్రేషన్స్ లో అల్లు అర్జున్, శిరీష్, మా ఇంటి ఆడపిల్లలు, వరుణ్, చరణ్ అందరూ పాల్గొన్నారు. నేను మిస్ అయ్యాను, అలాగే అన్ని వేడుకలు కలిసే చేసుకుంటాము, వృత్తిపరంగా, కెరీర్ లో ఎవరి అవకాశాలు వారు అందుకుంటూ ముందుకు వెళుతున్నారు.
ఏ ఫీల్డ్ అయినా కాంపిటీషన్ ఉంటుంది. సో ఇందులోనూ అంతే. మా కుటుంబాలు కలిసే ఉంటాయి. మేము అలానే సంతోషం గా ఉంటాము, అలాగే అల్లు అరవింద్ నన్ను వదిలేసి బాలయ్య తో అన్ స్టాపబుల్ చేయించడం విషయంలో చాలామందిలో చాలా అనుమానాలున్నాయి. నాకెలాంటి కంప్లైంట్ లేదు. ఆ షో బాగా ముందుకు వెళుతుంది. నాకు ఖాళీ లేదు కాబట్టి బాలయ్యని తీసుకున్నారు అందులో తప్పులేదు అంటూ మెగాస్టార్ మెగా-అల్లు ఫ్యామిలీల మధ్యన విభేదాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు.