ఈరోజు కోలీవుడ్ లో అజిత్, విజయ్ ఫాన్స్ మధ్యన పెద్ద రగడ మొదలయ్యింది. అసలే వీరిరువురి అభిమానులు హద్దులు దాటి ప్రవర్తిస్తారు. అజిత్-విజయ్ బాగానే ఉంటారు. మధ్యలో ఫాన్స్ మాత్రం అస్సలూరుకోరు. కొట్టుకుచస్తారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో ఫైట్ చేస్తారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈ రోజు బుధవారం తమిళనాట అజిత్ తునివి-విజయ్ వారిసు బాక్సాఫీసు ఫైట్ కి దిగాయి. ఇంకేముంది ఫాన్స్ కూడా అలెర్ట్ అయ్యారు. మా సినిమా గొప్ప అంటే మా సినిమా గొప్ప అంటూ మొదలెట్టేసాడు. భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన అజిత్ తునివి కి సో సో టాక్ రాగా.. విజయ్ వారిసుకి బెటర్ టాక్ రావడంతో.. అజిత్ ఫాన్స్ రెచ్చిపోయారు.
వారిసులోని పాజిటివ్ పాయింట్స్ వదిలేసి నెగెటివ్ పాయింట్స్ ని హైలెట్ చెయ్యడమే కాదు.. #VarisuDisaster హాష్ టాగ్ ని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే వారిసు నిర్మాత దిల్ రాజు అజిత్ కన్నా విజయ్ గొప్ప అంటూ అగ్గి రాజేసాడు. అక్కడ తమిళనాట థియేటర్స్ విషయంలోనే ఈ రచ్చ తారాస్థాయికి వెళ్ళింది. ఇప్పుడు అజిత్ సినిమా తునివి కి వచ్చిన టాక్ తో డిస్పాయింట్ అయిన ఫాన్స్.. విజయ్ సినిమాని నెగెటివ్ చెయ్యాలని చూస్తున్నారు.
అందుకే పనిగట్టుకుని విజయ్ ఫాన్స్ ని ఉడికించాలి వారిసు ని టార్గెట్ చేసారు. #VarisuDisaster అంటూ #ThunivuBlockbuster హాష్ టాగ్స్ ని ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. మరి విజయ్ ఫాన్స్ దీనిని ఎదుర్కోవడానికి అప్పుడే రెడీ అయ్యారు. వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. #VarisuBlockbuster హాష్ టాగ్ తో ఫైట్ చేస్తున్నారు.