రాజమౌళి దర్శకత్వంలో తారక్-రామ్ చరణ్ కలయికలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కి నేడు వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందడమే కాదు.. ప్రతిష్టాత్మక ఆస్కార్ రేసులో ట్రిపుల్ ఆర్ నిలవడం భారతీయులందరికి గర్వకారణం. సినిమా విడుదలై ఏడాది గడిచిపోయినా.. రాజమౌళి అండ్ హీరోలు ఇంకా ఇంకా ట్రిపుల్ ఆర్ మ్యానియాలోనే ఉన్నారు. తాజాగా ఆర్.ఆర్.ఆర్. చిత్రంలోని నాటు నాటు... గీతానికి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడం భారతీయులందరూ ఎంతో సంతోషించదగ్గ పరిణామం. ఈ పురస్కారం అందుకోవడానికి హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ తమతమ భార్యలతో అమెరికా వెళ్లారు. కీరవాణి ఆయన భార్య వల్లి, రాజమౌళి ఆయన భార్య రమా, కొడుకు కార్తికేయ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఈ అవార్డు వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరనుండి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ట్రిపుల్ ఆర్ టీమ్ ని మెచ్చుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్స్ వేస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ట్రిపుల్ ఆర్ టీమ్ ని అభినందిస్తూ.. Delighted to learn that @RRRMovie has won the #GoldenGlobes Award for Best Original Song! Congratulations తో @mmkeeravaani, @ssrajamouli and the entire team! Absolutely proud! Like I said earlier, Telugu has now become the language of Indian soft power. #NaatuNaatu #RRRMovie అంటూ ట్వీట్ చేసారు.
అయితే ప్రధాని మోడీ నుండి సీఎం జగన్ వరకు అందరూ ట్రిపుల్ ఆర్ టీమ్ ని అప్రిశేట్ చెయ్యడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందరికి రిప్లైస్ ఇస్తూ.. చంద్రబాబు ట్వీట్ కి Thank you so much mavayya.. అంటూ రీ ట్వీట్ చేసాడు దానితో అటు టిడిపి కార్యకర్తలు, ఇటు ఎన్టీఆర్ ఫాన్స్ ముచ్చటపడిపోతున్నారు. ఎందుకంటే కొన్నాళ్లుగా ఎన్టీఆర్-చంద్రబాబు ఫామిలీస్ డిస్టెన్స్ మెయింటింగ్ చేస్తున్నాయి. అందుకే ఈ ట్వీట్ చాలా త్వరగా వైరల్ అయ్యింది.