Advertisementt

ఊపులో ఉన్న బాలయ్య-చిరు

Tue 10th Jan 2023 10:33 PM
veera simha reddy,waltair veerayya  ఊపులో ఉన్న బాలయ్య-చిరు
Chiranjeevi vs Balakrishna ఊపులో ఉన్న బాలయ్య-చిరు
Advertisement
Ads by CJ

బాలకృష్ణ-చిరంజీవి ఇద్దరూ మంచి ఊపులో ఉన్నారు. ఒకరు అఖండ బ్లాక్ బస్టర్ తో ఉంటే ఒకరు గాడ్ ఫాదర్ హిట్ తో ఉన్నారు. అంతేకాదు.. చిరు-బాలయ్యలది ఇంచుమించు ఒకటే వయసు. ఈ వయసులోనూ ఈ సీనియర్ హీరోలిద్దరూ తమ సినిమాలతో పోటీ పడడమే కాదు, ప్రమోషన్స్ లోను జోరు చూపిస్తున్నారు. వీర సింహ రెడ్డిగా బాలయ్య, వాల్తేర్ వీరయ్యగా మెగాస్టార్ చిరు ఇద్దరూ నువ్వా-నేనా అంటున్నారు. చిరు-బాలయ్య మధ్యలో శృతి హాసన్ అన్నట్టుగా ఆమె వీర సింహ రెడ్డి ఈవెంట్ లో పాల్గొనగానే అనారోగ్యంతో ఇంట్లోనే ఉండిపోయింది. వాల్తేర్ వీరయ్య ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయింది. 

అటు చిరు ఇటు బాలయ్యలు మాత్రం సోలో ఇంటర్వూస్, ఛానల్ ఇంటర్వూస్ తో సంక్రాంతి పండగని ఓ వారం ముందే చూపిస్తున్నారు. ట్రెడిషనల్ డ్రెస్సులతో ఈ ఇద్దరు హీరోలు చేసే హంగామాతో సంక్రాంతి పండగ కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఉదయభానుతో కలిసి బాలకృష్ణ, వీర సింహారెడ్డి దర్శకుడి గోపీచంద్ హంగామా చేస్తే మెగాస్టార్ చిరు ఆయన దర్శకుడు బాబీ తో కలిసి సుమ అడ్డా ప్రోగ్రాం కి గెస్ట్ గా హాజరయ్యారు. 

జనవరి 12 వీర సింహ రెడ్డి, 13 వాల్తేర్ వీరయ్య లతో థియేటర్స్ దద్దరిల్లిపోవడం మాత్రం ఖాయంగ కనిపిస్తుంది. ఈ రెండు సినిమాలకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ పడినా.. ఫామిలీస్ థియేటర్స్ కి క్యూ కట్టేస్తాయి. అయితే కోలీవుడ్ నుండి ఈ సంక్రాంతికి అజిత్ తెగింపు, విజయ్ వారసుడు విడుదలవుతున్నా వీరసింహ రెడ్డి-వాల్తేర్ వీరయ్యల ప్రమోషన్స్ ముందు అవి కొద్దిగా తక్కువే అనిపిస్తున్నారు. చిరు-బాలయ్యలు ఇద్దరూ దున్నేసేలా కనబడుతున్నారు. ఈ సంక్రాంతికి నిజమైన పందెంకోళ్లు చిరు - బాలయ్యలే.  

Chiranjeevi vs Balakrishna:

Veera Simha Reddy vs Waltair Veerayya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ