సంక్రాంతి సినిమాలు ఆడియన్స్ ముందుకు రావడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని గంటల్లో కోలీవుడ్ నుండి అజిత్ తెగింపుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో అజిత్ ఫాన్స్ కోరిక మేరకు రేపు బుధవారం జనవరి 11 ఉదయం 7 గంటలకే హైదరాబాద్ లో తెగింపు షో పడబోతోంది. హైదరాబాద్ మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్ లో తెగింపు స్పెషల్ షో బుధవారం ఉదయం 7 గంటలకి ప్రదర్శించబోతున్నారు. ఇక ఆ తర్వాత రోజు గురువారం బాలకృష్ణ వీరసింహ రెడ్డి రాబోతుంది. జనవరి 12న క్రేజీగా విపరీతమైన అంచనాలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల కోసం వీర సింహ రెడ్డిగా బాలయ్య గర్జించడానికి సిద్ధమయ్యారు.
తర్వాత రోజు జనవరి 13 శుక్రవారం మెగాస్టార్ వాల్తేర్ వీరయ్యగా మాస్ ఆడియన్స్ ని ఊపెయ్యడానికి రంగం సిద్ధం చేసారు. ఆ తర్వాత రోజు విజయ్ వారసుడు, సంతోష శోభన్ ల కళ్యాణం కమనీయం భోగి పండగ రోజు బాక్సాఫీసు బరిలోకి రాబోతున్నాయి. అయితే ఇక్కడ ఏ సినిమాకి ఎలాంటి టాక్ వచ్చినా.. మొదటి వీకెండ్ కి కలెక్షన్స్ జోరు తగ్గిపోతుంది. కారణం ఈసారి సంక్రాంతి మూడు రోజులు వీకెండ్ హాలిడేస్ లో కలిసిపోయాయి. మామూలుగానే శనివారం, ఆదివారం సినిమాలకి వీకెండ్, అటు సంక్రాంతి మూడు రోజులు హాలిడేస్ కలిసొస్తాయి.
వీక్ మిడిల్ లో పండగ వస్తే సినిమాలకి కలిసొచ్చేది. కానీ ఇక్కడ వీకెండ్ లోనే సంక్రాంతి మూడురోజులు ముగిసిపోతుంది. ఆ తర్వాత నుండి అటు సాఫ్ట్ వెర్ కంపెనీలు, ఇటు కాలేజీలు ఓపెన్ అవుతాయి, ఫ్యామిలీ ఆడియన్స్ వెనకడుగు వేస్తారు. సో సినిమాలకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా, సూపర్ హిట్ టాక్ వచ్చినా రెండు వారాల కలెక్షన్స్ వస్తాయి.
కానీ పండగ సినిమాలకి టాక్ తేడా కొడితే ఫస్ట్ వీకెండ్ లోనే కలెక్షన్స్ తగ్గిపోతాయి. అటు సంక్రాంతి హాలిడేస్ వీకెండ్ లో కొట్టుకుపోవడంతో వేరే ఆప్షన్ కూడా లేదు. మరి ఈసారి సంక్రాంతి సినిమాలకి ఈ వీకెండ్ గండం అలా పొంచి ఉందన్నమాట.