Advertisementt

బింబిసార దర్శకుడుతో బాలయ్య సినిమా

Thu 12th Jan 2023 04:31 PM
balakrishna  బింబిసార దర్శకుడుతో బాలయ్య సినిమా
Balayya movie with Bimbisara director బింబిసార దర్శకుడుతో బాలయ్య సినిమా
Advertisement
Ads by CJ

నందమూరి కళ్యాణ్ రామ్ స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తూ తరికెక్కిన బింబిసార చిత్రంతో దర్శకుడుగా వశిష్ట పరిచమయ్యారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో సోషియో ఫాంటసీగా రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. టఫ్ కాన్సెప్ట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టిన వశిష్ట మొదటి సినిమాతోనే టాలెంటెడ్ దర్శకుడిగా పరిశ్రమ దృష్టిలో పడ్డాడు. చిరంజీవి, బాలయ్య తో పాటు పరిశ్రమలోని అగ్ర హీరోలు అందరూ బింబిసార మీద ప్రశంసల వర్షం కురిపించడంతో వశిష్ట తర్వాత సినిమా ఏంటనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. 

లేటెస్ట్ న్యూస్ ప్రకారం నటసింహ నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని వశిష్ట దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలయ్య తాజా చిత్రం వీర సింహారెడ్డి విడుదలకు సిద్ధంగా ఉండగా తన తరువాత సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు  ఈ సినిమాకి సంబంధించి ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. ధమాకా తో హాట్ షాట్ హీరోయిన్ గా మారిపోయిన శ్రీ లీల ఇందులో బాలయ్యకు కూతురుగా నటిస్తుండగా, ప్రియమణి హీరోయిన్ గా కనిపించనున్నట్లు సమాచారం.

అనిల్ రావిపూడి చిత్రం తర్వాత బాలకృష్ణ వశిష్ట దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారట. వశిష్ట నేరెట్ చేసిన సోషియో ఫాంటసీ స్టోరీ బాలయ్య కి ఎంతగానో నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

Balayya movie with Bimbisara director:

NBK Film in Geetha Arts Banner

Tags:   BALAKRISHNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ