Advertisementt

బాబీకి ‘ఇంద్ర’.. నాకు ‘విజేత’: రవితేజ

Tue 10th Jan 2023 07:49 AM
raviteja,waltair veerayya,ravi teja speech,vijetha,bobby,indra,pre release event  బాబీకి ‘ఇంద్ర’.. నాకు ‘విజేత’: రవితేజ
Ravi Teja Speech at Waltair Veerayya Pre Release Event బాబీకి ‘ఇంద్ర’.. నాకు ‘విజేత’: రవితేజ
Advertisement
Ads by CJ

విజయవాడ‌లో ‘విజేత’ సినిమా సక్సెస్ వేడుక జరుగుతున్నప్పుడే ఫిక్సయిపోయా.. ఏదో ఒక రోజు మెగాస్టార్ చిరంజీవిగారి పక్కన కూర్చుంటానని.. అక్కడ మొదలెడితే.. ఇప్పుడు వీరయ్య దగ్గరకు వచ్చేశా.. అన్నారు మాస్ మహారాజా రవితేజ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో ఆయన ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం వైజాగ్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో మాస్ రాజా రవితేజ మాట్లాడుతూ.. 

మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య నటీనటులకు, సాంకేతిక నిపుణలందరికీ ఆల్ ది బెస్ట్ కాదు.. కంగ్రాట్స్. ఎందుకంటే సినిమా బ్లాక్‌బస్టర్. పూనకాలు లోడింగ్. చిరంజీవిగారితో నా జర్నీ మొదలైయింది విజయవాడ నుండి. గుంటూరుకు చెందిన బాబీ ‘ఇంద్ర’ సినిమాతో ఎలా అయితే అనుకున్నాడో.. ‘విజేత’ వేడుక విజయవాడలో జరిగినప్పుడు నేనూ అదే అనుకున్నాను. ఆ వేడుకలో చిరంజీవిగారిని చాలా దూరం నుండి చూశాను. అప్పుడే మా ఫ్రెండ్స్‌తో చెప్పా. ఏదో ఒక రోజు.. ఆయన పక్కన కూర్చుంటానని. ఆ వేడుకలో చిరంజీవిగారి పక్కన కోదండరామిరెడ్డి, భానుప్రియగారు కూర్చున్నారు. అక్కడ నుండి మొదలైతే మొదట ఫ్రెండ్ క్యారెక్టర్, తర్వాత తమ్ముడి క్యారెక్టర్.. ఇప్పుడు వాల్తేరు వీరయ్య. 

చిరంజీవిగారితో వున్న ప్రతి మూమెంట్ చాలా గర్వంగా వుంటుంది. ఆయన నన్ను ఎంతో ఇష్టపడతారు, ప్రేమిస్తారు. అన్నయ్య ఎవరేమన్నా భరిస్తారు.. బాధపడతారేమో కానీ బయటపడరు. ఆయనలో వున్న గొప్ప లక్షణం అది. ఆయన ఎప్పుడూ ఎవరి గురించి నెగిటివ్‌గా మాట్లాడలేదు. బాబీ బలుపు సమయంలో పరిచయమయ్యాడు. పవర్ తీశాడు. వీరయ్యతో నెక్స్ట్ లెవల్‌కి వెళ్తాడని నా గట్టి నమ్మకం. దేవిశ్రీ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. సక్సెస్ మీట్‌లో మళ్ళీ కలుద్దాం’’ అన్నారు.

Ravi Teja Speech at Waltair Veerayya Pre Release Event:

Bobby inspired with Indra and RaviTeja Inspired with Vijetha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ