Advertisementt

పెళ్లి వార్తలపై శ్రీముఖి ఫైర్

Sun 08th Jan 2023 01:03 PM
anchor sreemukhi,fire,wedding rumours,social media,  పెళ్లి వార్తలపై శ్రీముఖి ఫైర్
Anchor Sreemukhi Fires On Her Wedding Rumours పెళ్లి వార్తలపై శ్రీముఖి ఫైర్
Advertisement
Ads by CJ

కొద్దిరోజులుగా యాంకర్ శ్రీముఖి హాట్ షో బుల్లితెర ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తుంది. కొద్దిగా సన్నబడి, ఎక్కువగా గ్లామర్‌గా తయారైన శ్రీముఖి.. ఓ వ్యాపావేత్తని వివాహమాడబోతుంది... శ్రీముఖి ప్రేమించిన ఆ వ్యాపారవేత్తతో పెళ్లికి శ్రీముఖి ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది... త్వరలోనే శ్రీముఖి వివాహానికి ఇరు పెద్దలు ముహుర్తాలు పెట్టెయ్యబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది. అలాగే శ్రీముఖి కొత్తింట్లోకి గృహ ప్రవేశం చెయ్యడం.. ఇలా కొద్దిరోజులుగా శ్రీముఖి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.

కానీ ఈ పెళ్లి వార్తలపై శ్రీముఖి ఫైర్ అయ్యింది. తనకి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని, తాను పెళ్లి చేసుకుంటే ముందు మీకు చెప్పే చేసుకుంటాను అంటూ చెప్పిన శ్రీముఖి.. గాసిప్ రాయుళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంతదారుణమైన న్యూస్‌లు క్రియేట్ చేస్తున్నారో తెలుసా.. నా తండ్రి ఫోటోని మార్ఫింగ్ చేసి నేను పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి ఇతనే అంటూ యూట్యూబ్‌లో తన్మైల్ పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఇలా నాకు ఎన్నిసార్లు పెళ్లి చేస్తారు. ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు అంటూ శ్రీముఖి తన పెళ్లి వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై ఫైర్ అయ్యింది.

Anchor Sreemukhi Fires On Her Wedding Rumours:

Sreemukhi gives Clarity about her Marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ