Advertisementt

సమంత ‘శాకుంతలం’ ట్రీట్‌కి డేట్ ఫిక్స్

Sat 07th Jan 2023 09:23 PM
shaakuntalam,trailer release date,samantha,gunasekhar,shaakuntalam movie,dev mohan  సమంత ‘శాకుంతలం’ ట్రీట్‌కి డేట్ ఫిక్స్
Release Date Fixed for Shaakuntalam Movie Trailer సమంత ‘శాకుంతలం’ ట్రీట్‌కి డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

రీసెంట్‌గా వచ్చిన ‘యశోద’‌తో సంచలన విజయం అందుకున్న సమంత.. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులని అలరించేందుకు ‘శాకుంతలం’ చిత్రంతో సిద్ధమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కాబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం చిత్రయూనిట్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టబోతోంది. అందులో భాగంగా థియేట్రికల్ ట్రైలర్‌ విడుదలకు డేట్ ఫిక్స్ చేసినట్లుగా మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. జనవరి 9న మధ్యాహ్నం 12 గంటల 06 నిమిషాలకు ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. 

 

ఈ పోస్టర్‌ న్యాచురల్ లుక్‌తో కలర్‌ఫుల్‌గా ఉండటమే కాకుండా.. ‘శాకుంతలం’ సినిమా ఎంత పీస్‌ఫుల్‌గా ఉండబోతుందో తెలియజేస్తుంది. అలాగే హీరోహీరోయిన్లు ప్రేమలో మునిగిపోయినట్లుగా కూడా చూపించారు. ఈ పోస్టర్‌తో సినిమాపై భారీగా అంచనాలను పెంచేశారు. మొత్తంగా అయితే ట్రైలర్‌తో ట్రీట్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమైనట్లుగా ఈ లుక్‌తో క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

కాగా, సమంత మయోసైటీస్ వ్యాధితో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ‘శాకుంతలం’కు సంబంధించి ప్రస్తుతం సమంత డబ్బింగ్ చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఆమె డబ్బింగ్ పెండింగ్ కారణంగానే.. ఈ సినిమా విడుదల వాయిదా పడింది.. లేదంటే ఈ సరికే ఈ సినిమా విడుదలై ఉండేది. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సమంత శకుంతలగా నటించిన ఈ చిత్రంలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు.

Release Date Fixed for Shaakuntalam Movie Trailer:

Samantha Shaakuntalam Treat on Jan 9th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ