Advertisementt

చైతూ యమా ఫాస్ట్‌గా ఉన్నాడు

Sat 07th Jan 2023 08:39 PM
naga chaitanya,venkat prabhu,custody movie,final schedule,chaitu film  చైతూ యమా ఫాస్ట్‌గా ఉన్నాడు
Naga Chaitanya Custody Movie in the final Schedule చైతూ యమా ఫాస్ట్‌గా ఉన్నాడు
Advertisement
Ads by CJ

నాగచైతన్య, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి.. రీసెంట్‌గా ‘కస్టడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా యమా ఫాస్ట్‌గా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్‌కి చేరుకున్నట్లుగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం నుంచి ఈ చిత్ర చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించారు.

ఈ షెడ్యూల్‌తో ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తవుతాయని, ఈ షెడ్యూల్‌లో ప్రధాన నటీనటులందరూ షూట్‌లో పాల్గొంటారని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన స్టిల్స్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన గ్లింప్స్.. మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని టెక్నికల్ బ్రిలియన్స్ అందరినీ ఆకట్టుకోవడం విశేషం.

నాగచైతన్య సరసన మరోసారి కృతిశెట్టి నటిస్తున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రియమణి ఓ పవర్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంతో ‘కార్తీకదీపం’ సీరియల్ ఫేమ్ ప్రేమి విశ్వనాథ్(వంటలక్క) తెలుగు వెండితెరకు పరిచయమవుతోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. 12 మే, 2023న సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.  

Naga Chaitanya Custody Movie in the final Schedule:

Naga Chaitanya and Venkat Prabhu Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ