సంక్రాంతికి సింహం వేట సిద్ధమైంది. నందమూరి బాలకృష్ణ గర్జించే సమయం ఆసన్నమైంది.. ఆ విషయం తాజాగా విడుదలైన ట్రైలర్ చెప్పేస్తుంది. పవర్ ఫుల్ డైలాగ్స్‌తో, పవర్ ఫుల్ కంటెంట్‌తో గోపీచంద్ మలినేని తన అభిమానం మొత్తం రంగరించి.. నందమూరి అభిమానులకు ఓ మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడనేది.. తాజా ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేసింది. ఇక ‘వీరసింహారెడ్డి’ వేటకి థియేటర్లు ఏ రేంజ్‌లో బద్దలు కాబోతున్నాయో.. అనేదానికి జనవరి 12 సాక్ష్యం కాబోతోంది.
‘సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదనే.. నేనొక్కడినే కత్తిపట్టా.. పరపతి కోసమో.. పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు.. సీమ మీద ఎఫెక్షన్’
‘వీరసింహారెడ్డి.. పుట్టింది పులిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్..’
‘మైలురాయికి మీసం మొలిసినట్టున్నాదిరా..’
‘పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరకైనా వెళ్లి నిలబడు.. అక్కడ నీకొక స్లోగన్ వినిపిస్తుంది’
‘అపాయింట్‌మెంట్ లేకుండా వస్తే.. అకేషన్ చూడను, లొకేషన్ చూడను.. ఒంటి చేత్తో ఊచకోత కోస్తా.. నా కొ**కా’
‘సంతకాలు పెడితే.. బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించినవాడి పేరు మారదు.. మార్చలేరు’
‘పదవి చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్ నా డిఎన్ఏకే పొగరెక్కువ..’ ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్‌తో, బాక్సులు బద్దలయ్యేటటువంటి మ్యూజిక్‌తో ఈ ట్రైలర్ ఊచకోత మొదలైంది. అలాగే సెంటిమెంట్‌కు కూడా పెద్ద పీట వేసినట్లుగా కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఈ ట్రైలర్‌తో జత చేశారు. ఓవరాల్‌గా.. సంక్రాంతికి వీరసింహారెడ్డి మాస్ మోత మోగడం ఖాయం అనేది ట్రైలర్ చెప్పేస్తుంది.