Advertisementt

ఆ విషయంలో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి!

Sat 07th Jan 2023 12:38 PM
mahesh babu,fans,happy,vaarasudu trailer,vijay,dil raju,kollywood,  ఆ విషయంలో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి!
Mahesh Fans Happy after Watching Vaarasudu Trailer ఆ విషయంలో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి!
Advertisement
Ads by CJ

మహేష్‌తో ‘మహర్షి’ మూవీ తర్వాత వంశీ పైడిపల్లి మరో సినిమా చేయాలని మహేష్ కాంపౌండ్‌లోనే ఉండిపోయాడు. కథ ఓకే అనుకున్నాకే మహేష్ బాబుతో వంశీ సినిమా కన్‌ఫర్మ్ అయ్యింది. కానీ మహేష్ ఎందుకో ఆలోచించి ఆలోచించి.. పరశురామ్‌తో ‘సర్కారు వారి పాట’కి వెళ్ళిపోయాడు. మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కథ నచ్చకే ఆయన ఆ సినిమా వదులుకున్నాడన్నారు. అదే కథతో వంశీ పైడిపల్లి.. దిల్ రాజుతో కలిసి కోలీవుడ్ హీరో విజయ్‌కి కథ చెప్పడం, విజయ్ తెలుగు, తమిళ్‌లో వర్కౌట్ అవుతుంది అని వంశీ తో చేతులు కలిపి తమిళ్‌లో ‘వారిసు’గా.. తెలుగులో ‘వారసుడు’గా సినిమాని పట్టాలెక్కించేసి.. సంక్రాంతి బరిలో విడుదల అని చెప్పెయ్యడంతో వివాదం మొదలైంది.

దిల్ రాజుపై తెలుగు నిర్మాతలు ఫైట్ చేశారు. డబ్బింగ్ సినిమాల విషయంలో దిల్ రాజు చెప్పిన పద్దతిని ఆయనే ఫాలో అవడం లేదు అంటూ దండయాత్ర చేసినా దిల్ రాజు తగ్గలేదు. తాజాగా వరుస ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. వారసుడు ట్రైలర్ చూసిన నెటిజెన్స్.. ఈ సినిమా మొత్తం మహేష్ నటించిన బ్రహ్మోత్సవం, మహర్షి, పవన్ అజ్ఞాతవాసి చిత్రాలని పోలి ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు.

అదే మహేష్ చేసి ఉంటే దెబ్బైపోయేవాడే.. మహేష్ తప్పించుకుని మంచి పని చేసాడంటున్నారు. నిజంగా ఆ సినిమా గనక మహేష్ చేసి ఉంటే.. మహర్షి సినిమాలాగే ట్రీట్ చేసేవారు కానీ.. కొత్తగా చూసేవారు కాదు. ఇది చూసిన మహేష్ ఫాన్స్ హమ్మయ్య మహేష్ తప్పించుకున్నాడని.. ఖుషి‌గా హ్యాపీ మోడ్‌లోకి వెళుతున్నారు.

Mahesh Fans Happy after Watching Vaarasudu Trailer:

Fans Happy with Mahesh Babu Decision

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ