Advertisementt

ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్న పూరి జగన్నాథ్

Fri 06th Jan 2023 04:40 PM
director puri jagannadh,lavanya  ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్న పూరి జగన్నాథ్
Director Puri Jagannadh wife Lavanya birthday celebration ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్న పూరి జగన్నాథ్
Advertisement
Ads by CJ

లైగర్ సినిమా డిసాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ సైలెంట్ గానే ఉంటున్నాడు. తదుపరి సినిమా జన గణ మన ఆగిపోవడంతో పూరి జగన్నాథ్ తదుపరి ప్రాజెక్ట్ పై అందరిలో ఆసక్తి మొదలైంది. కానీ లైగర్ కష్టాలు మాత్రం పూరీని వీడలేదు. అటు డిస్ట్రిబ్యూటర్స్ బెదిరింపులు, ఇటు లైగర్ బడ్జెట్ విషయంలో ఈడీ విచారణతో పూరి సతమతమవుతున్నాడు. అయితే పూరి జగన్నాథ్ సినిమా కోసం భార్య పిల్లలని పక్కనబెట్టేసి పని చేసే డెడికేషన్ ఉన్న వ్యక్తి. ఆయన నటి, నిర్మాత ఛార్మితో కలిసి సినిమాలని నిర్మిస్తూ.. డైరెక్ట్ చేస్తూ ఫ్యామిలీకి దూరంగా ఉంటాడు.

ఈ విషయంలో మీడియా ఎంత కూసినా పూరి జగన్నాథ్ పెద్దగా పట్టించుకోడు. అయితే ఇప్పుడు లైగర్ డిసాస్టర్ తరవాత పూరి జగన్నాథ్ ఫ్యామిలీతో కలిసి సమయం గడుపుతున్నాడు. తాజాగా పూరి జగన్నాథ్ భార్య లావణ్య బర్త్ డే ని తన పిల్లలు మధ్యన నిర్వహించి హ్యాపీ గా సెలెబ్రేట్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భార్య లావణ్యతో కేక్ కట్ చేయించి ప్రేమతో తినిపిస్తున్న పిక్స్ వైరల్ గా మారాయి.

Director Puri Jagannadh wife Lavanya birthday celebration :

Director Puri Jagannadh wife Lavanya birthday celebration photos viral 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ