పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొదటిసారి ఓ టాక్ షోకి హాజరవడం.. అది కూడా బాలకృష్ణ అన్ స్టాపబుల్ కి ప్రభాస్ రావడంపై ఆ ఎపిసోడ్ పై ఫాన్స్ లోనే కాదు సాధారణ ప్రేక్షకుల్లోనూ విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ప్రభాస్-బాలకృష్ణ ల అన్ స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 1 ప్రసారం కాగా.. అది స్ట్రీమింగ్ లోకి వచ్చిన కొద్ది క్షణాలకు ఆహా సైట్ క్రాష్ అయ్యింది. ఇప్పుడు ఈ రోజు శుక్రవారం జనవరి 6 న ప్రభాస్-గోపీచంద్ ల పార్ట్ 2 స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్-గోపీచంద్ ల స్నేహం పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు బాలయ్య.
గోపీచంద్-ప్రభాస్ ఇద్దరూ 2008 నుండి మంచి ఫ్రెండ్స్. వీరిద్దరూ కలిసి వర్షం సినిమాలో హీరో-విలన్ పాత్రల్లో కనిపించారు. అయితే ఆహా స్టేజ్ పైన బాలకృష్ణ వీళ్లిద్దరికీ క్రేజీ ప్రశ్నలు సంధించారు. అందులో ముఖ్యంగా గోపీచంద్ కి కోపం వస్తే ఏం చేస్తాడని ప్రభాస్ ని బాలయ్య అడిగారు. దానికి ప్రభాస్ చెబుతూ ఒకసారి గోపీచంద్ ముక్కుకి బలంగా దెబ్బతాకింది. అయితే నాకు నవ్వొచ్చినప్పుడు ఎవరి భుజంపై అన్నా కొట్టడం అలవాటు. అలా ఎప్పుడూ కొట్టొద్దని గోపీచంద్ నాకు ముందే చెప్పాడు. ఒకసారి ఇద్దరం కలిసి కారులో వెళుతున్నప్పుడు నాకు నవ్వొచ్చి గోపీచంద్ భుజంపై గట్టిగా కొట్టాను. పాపం గోపి ముక్కునుండి రక్తంవచ్చేసింది. అప్పుడు కూడా నన్ను ఏమి అనలేదు, గోపి చాలా మంచోడు, కోపం రాదు అన్నాడు ప్రభాస్,.
ఇక ప్రభాస్ కి కోపం వస్తే ఎలా ఉంటుంది అని గోపిని బాలయ్య అడిగారు. దానికి గోపీచంద్ ప్రభాస్ కి కోపం వస్తే తనపక్కన ఉన్నవాళ్ళని వెంటనే వెళ్లిపొమ్మంటాడు. గెటవుట్ అంటాడు, అలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తాడు.. అంటూ ప్రభాస్ కోపం గురించి గోపీచంద్ ఇలా చెప్పాడు.