నటుడు శివబాలాజీ సినిమాల్లో అడపాదడపా కేరెక్టర్స్ చేస్తూనే సౌత్ లోకి అప్పుడే ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా మొదలైన ఆ సీజన్ లో శివ బాలాజీ విన్నర్ గా నిలిచాడు. ఇంకేంటి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు, శివ బాలాజీ కి ఆఫర్స్ వెల్లువలా వస్తాయనుకుంటే.. అస్సలు అడ్రెస్స్ లేకుండా పోయాడు. యూట్యూబ్ ఛానల్ లో భార్య మధుమితతో కలిసి వంటలు చెయ్యడం, అతని కుటుంబంతో కలిసి గడపడం వంటివి చేసాడు. తర్వాత కొన్నాళ్లుగా కనిపించని శివ బాలాజీ మా ఎలక్షన్స్ విషయంలో హైలెట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా సైలెంట్ గానే ఉన్న శివ బాలాజీ ఈటీవీలో మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రోగ్రామ్ కి స్నేహ తో కలిసి జెడ్జ్ ప్లేస్ లో కూర్చున్నాడు.
అయితే ప్రస్తుతం మధుమిత-శివ బాలాజీ లు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇస్తున్నారు. వారు ఇన్నాళ్లు కనిపించకుండా పోవడానికి కారణం శివబాలాజీ ఈము కోళ్ల వ్యాపారంలోకి వెళ్లి అక్కడ బాగా దెబ్బతిన్నట్లుగా ఇంటర్వ్యూలో వారు చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీతో 100 కి పైగా ఈము కోళ్లు పెట్టి వాటి ఫుడ్ కి నెలకి 5 లక్షలు వెచ్చించడం ఇవన్నీ కాస్త భారమైంది. కానీ ఈము మీట్, అలాగే దాని స్కిన్ లెదర్ బాగ్స్ తయారీకి వెళ్లడం, దాని ఫ్యాట్ ఇతర వస్తువులకు వినియోగించడం అన్నారు కానీ.. ఆ మర్కెట్ ఇంకా జరగలేదు. ఈము మీట్ కూడా ఇంకా ఎవరూ పెద్దగా ఇష్టపడకపోవడం వంటివాటితో లాస్ అయ్యాము.
నేను ఇప్పుడిప్పుడే ఈ బిజినెస్ స్టార్ట్ అయ్యింది. చాలా బావుంటుంది అనుకున్నాను, కానీ ఈ బిజినెస్ లో బాగా లాస్ అయినట్లుగా శివ బాలాజీ, మధుమితలు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.