దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన వారసుడు ఈ నెల 12 న సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ కాబోతుంది. థియేటర్స్ విషయంలో వివాదాలు నడుస్తున్నా దిల్ రాజు వెనక్కి తగ్గకుండా వారసుడిని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాడు. బాలకృష్ణ వీర సింహ రెడ్డి vs చిరంజీవి వాల్తేర్ వీరయ్య అన్న రేంజ్ లో పోటీపడుతున్న తెలుగు రాష్ట్రాల్లో వారసుడు హీట్ కూడా బాగానే ఉంది. మరొక్క వారంలో విడుదల కాబోతున్న వారసుడు యూనిట్ లో తీవ్ర విషాదం నెలకొంది.
వారసుడు కి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సునీల్ బాబు హార్ట్ ఎటాక్ తో కేరళ ఎర్నాకుళంలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూయడంతో వారిసు చిత్ర బృందం విషాదంలో మునిగిపోయింది. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సునీల్ బాబు.. ట్రీట్మెంట్ తీసుకుంటుండగానే గురువారం రాత్రి కన్ను ముయ్యడం అందరిని కలిచివేసింది. సునీల్ బాబు మృతికి పలువురు సంతాపం తెలుపుతుండగా.. ఆయన అంత్యక్రియలు ఈ రోజు ఫ్రైడే జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.