2021 డిసెంబర్ లో అఖండ తో బాలకృష్ణ థియేటర్స్ లో మోత మోగించారు. బాలకృష్ణ అఖండ గెటప్ లో ఆయన చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ కి విలన్ పాత్రలే ఒణికిపోయాయి. అఖండ పాత్ర డైలాగ్స్ ముందు విలన్స్ ఒణికిపోయేలా, ఫాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా బోయపాటి చూపించాడు.. బాలయ్య ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరు, ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి డైలాగ్ థియేటర్స్ లో అభిమానులు విజిల్స్ వేస్తూ కుర్చీలు ఎక్కి డాన్స్ లు చేసేలా చేసాయి. అఖండ, అఖండ ఇప్పటికి బాలయ్య ఫాన్స్ అదే ఊపులో ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ అఖండతో హిందీలోకి వెళ్ళబోతున్నారు. అఖండ డబ్బింగ్ వెర్షన్ ఈ నెల 20న హిందీలో విడుదల కాబోతుంది.
తాజాగా హిందీ ట్రైలర్ వదలగానే.. అందరూ ముందు బాలయ్య డబ్బింగ్ గురించే ఆలోచించారు. హిందీలో బాలయ్య పాత్రకి గర్జించే వాయిస్ ఉంటుందా అని. కానీ హిందీలో అఖండ ట్రైలర్ చూసాక బాలయ్య ఫాన్స్ సప్పబడిపోయారు. హిందీలో బాలయ్య పాత్రకి చెప్పిన డబ్బింగ్ వింటే అబ్బా అనిపిస్తుంది. తెలుగులో బాలయ్య పాత్రకి ఆయన చెప్పిన డబ్బింగ్ ఎంతో కీలకం. కానీ బాలకృష్ణ పాత్రకి హిందీలో చెప్పిన డబ్బింగ్ నాసిరకంగా కాదు.. అస్సలు ఆ డైలాగ్స్ బాలయ్య నోటి నుండి వినలేక పోతున్నామంటూ మీమర్స్ అఖండ హిందీ ట్రైలర్ ని ఏసుకుంటున్నారు.
హిందీలో అంత గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.. కనీసం ఓ పవర్ ఫుల్ వాయిస్ తో బాలయ్య పాత్రకి హిందీ డబ్బింగ్ చెప్పిస్తే పోయేది. కానీ బాలయ్య అఖండ పాత్రకి హిందీ డబ్బింగ్ వింటే ఫాన్స్ కి నీరసం వచ్చేస్తుంది.. మీమర్స్ కి అలా మేత దొరికింది.