Advertisementt

సినిమాల్లోకి రాకపోతే, అలా చేసేవాడిని: ప్రభాస్

Thu 05th Jan 2023 02:13 PM
prabhas,pan india movies  సినిమాల్లోకి రాకపోతే, అలా చేసేవాడిని: ప్రభాస్
If not a hero, I would have done business: Prabhas సినిమాల్లోకి రాకపోతే, అలా చేసేవాడిని: ప్రభాస్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ని, పాన్ ఇండియా స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్నారు. సలార్, ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్, మారుతి మూవీ, స్పిరిట్, సిద్దార్థ్ ఆనంద్ మూవీస్ ఇలా పాన్ ఇండియా కమిట్మెంట్స్, ఆ ప్రాజెక్టుల షూటింగ్స్ తో ప్రభాస్ దూసుకుపోతున్నారు. రీసెంట్ గా బాలకృష్ణ ఆహా అన్ స్టాపబుల్ టాక్ షోకి హాజరై అభిమానులకి కిక్ ఇవ్వగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తాను గనక హీరో కాకపోయుంటే ఏమయ్యేవాడో చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. 

తాను సినిమా ఇండస్ట్రీలోకి రాకపోయుంటే వ్యాపారం చేసుకునేవాడిని, అసలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచనే లేదు, నాకు చిన్నప్పటినుండి బిజినెస్ చెయ్యాలనే కల ఉండేది. నేను హోటల్ వ్యాపారం చెయ్యాలి అనుకున్నాను, నేను బేసిక్ గా ఫుడీ ని కాబట్టి హోటల్ బిజినెస్ చెయ్యాలని అనుకునేవాడిని, కానీ అప్పట్లో మా కుటుంబ పరిస్థితి బిజినెస్ చేసేందుకు అనుకూలంగా లేదు. అందుకే అప్పుడు ఆ వ్యాపారం లోకి వెళ్ళలేకపోయాను. కానీ తర్వాత చూస్తే సినిమాల్లోకి వచ్చి ఇలా అంటూ ప్రభాస్ హీరో అవడంపై ఆసక్తిర వ్యాఖ్యలు చేసారు.

అందుకే ప్రభాస్ ఇప్పుడు సినిమాలు చేస్తూనే వ్యాపారమూ మొదలు పెట్టారు. ఆయన చాలా ప్రదేశాల్లో స్థలాలు, పొలాలు కొంటూ ఇతర దేశాల్లోనూ స్థలాలపై మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లుగా ఎప్పటినుండో టాక్ ఉంది.

If not a hero, I would have done business: Prabhas:

Wanted to do business since childhood: Prabhas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ