Advertisementt

ఆదిపురుష్ కోసం ప్రభాస్ ఫాన్స్ ఆరాటం

Thu 05th Jan 2023 12:44 PM
prabhas,adipurush  ఆదిపురుష్ కోసం ప్రభాస్ ఫాన్స్ ఆరాటం
Prabhas fans are eager for Adipurush ఆదిపురుష్ కోసం ప్రభాస్ ఫాన్స్ ఆరాటం
Advertisement
Ads by CJ

అసలైతే ప్రభాస్-ఓమ్ రౌత్ ల ఆదిపురుష్ ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆదిపురుష్ టీజర్ పై వచ్చిన నెగెటివిటి చూసిన మేకర్స్ ఆదిపురుష్ ని హడావిడిగా వాయిదా వేసి జూన్ కి రిలీజ్ డేట్ మార్చేశారు. ఆదిపురుష్ లో ప్రభాస్ ని రాముడిలా ఒకలా ఊహించుకుంటే.. ఓమ్ రౌత్ ప్రభాస్ ని మరొకలా(యానిమేషన్ లో) చూపించి డిస్పాయింట్ చేసారు. ఆదిపురుష్ పై వచ్చిన నెగిటివిటీకి నిజంగా ఓమ్ రౌత్ కూడా భయాపడిపోయాడు. అందుకే ఇంకాస్త మంచి గ్రాఫిక్స్ అందించడానికి సమయం పడుతుంది అంటూ సినిమాని వాయిదా వేశారు.

అప్పటినుండి ఆదిపురుష్ టీమ్ కామ్ గా సైలెంట్ అయ్యింది. ముందు ఆదిపురుష్ విడుదల జనవరి 2023 లో అన్నారు. అందుకే ప్రభాస్ అభిమానులు ఈ వారంలో ఆదిపురుష్ అప్ డేట్ ఏదైనా ఇస్తే బావుంటుంది.. అంటూ రిక్వెస్ట్ లు పెడుతూ సోషల్ మీడియాలో #Adipurush హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఆదిపురుష్ హాష్ టాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. సినిమాని హాలీవుడ్ రేంజ్ లో రిలీజ్ చేస్తామని చెప్పిన మేకర్స్.. అక్కడి సినిమాలకి ధీటుగా చూపిస్తారో లేదో అనే భయం, ఆందోళన మాత్రం వాళ్లలో పోవడం లేదు.

ఆదిపురుష్ టీజర్ పై ఉన్న నెగిటివిటీ పోయేలా ఒక అప్ డేట్ ఇస్తే.. మళ్ళీ సినిమాపై క్రేజ్ పెరుగుతుంది. లేదంటే సినిమా విడుదల సమయానికి ఎంతోకొంత ట్రోలింగ్ అయితే తప్పదేమో అని ప్రభాస్ ఫాన్స్ భయం. మరి ప్రభాస్ ఫాన్స్ రిక్వెస్ట్ ని ఆదిపురుష్ మేకర్స్ ఎలా తీసుకుంటారో చూడాలి. 

Prabhas fans are eager for Adipurush:

Prabhas Adipurush update please

Tags:   PRABHAS, ADIPURUSH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ