చాలామంది హీరోలు, హీరోయిన్స్ పెళ్లి వయసుదాటిపోయినా.. పెళ్లి బంధంలోకి అడుగుపెట్టడానికి తెగ ఆలోచిస్తారు. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకుల్లో ప్రభాస్ ముందువరసలో ఉంటాడు. రానా, నితిన్, నిఖిల్ లు కోవిడ్ టైమ్ లో సైలెంట్ గా పెళ్లి పీటలెక్కేశారు. కానీ ప్రభాస్, శర్వానంద్, అడివి శేష్, విశ్వక్ సేన్ వంటి వాళ్ళు పెళ్లి అంటేనే ఆమడదూరం పారిపోతున్నారు. రీసెంట్ గా నాగ శౌర్య నచ్చిన అమ్మాయితో ఏడడుగులు నడిచాడు. అయితే బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి గెస్ట్ గా వచ్చిన హీరో శర్వానంద్ పెళ్ళెప్పుడు అనగానే ప్రభాస్ చేసుకున్నాక అన్నాడు.
దానితో ప్రభాస్ అలా అయితే నేను సల్మాన్ చేసుకున్నాక చేసుకుంటాను అనాలేమో అంటూ ఫన్ చేసాడు. తాజాగా శర్వానంద్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. శర్వానంద్ ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి జరగబోతుంది అని, ఆ అమ్మాయి అమెరికాలో జాబ్ చేస్తున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న ముచ్చట. శర్వాకి ఆ అమ్మాయికి త్వరలోనే పెళ్లి ముహుర్తాలు నిశ్చయించబోతున్నారని, ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యుల మధ్యనే నిర్వహించి, పెళ్లి గ్రాండ్ గా ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. కొద్దిరోజుల్లో శర్వానంద్ పెళ్లి విషయం అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.