Advertisementt

వీర సింహ రెడ్డి ఈవెంట్ వెన్యూ మారుతుందా?

Wed 04th Jan 2023 09:42 PM
jagan,veera simha reddy  వీర సింహ రెడ్డి ఈవెంట్ వెన్యూ మారుతుందా?
AP government forces Veera Simha Reddy event to cancel వీర సింహ రెడ్డి ఈవెంట్ వెన్యూ మారుతుందా?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కలయికలో పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వీర సింహ రెడ్డి మరొక్క వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సంక్రాంతి స్పెషల్ గా జనవరి 12 న థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న వీర సింహ రెడ్డి ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం వీర సింహ రెడ్డి నటుల ఇంటర్వూస్, అలాగే లిరిక్స్ రచయిత, ఫైట్ మాస్టర్ , విలన్ ఇలా ఇంటర్వూస్ ఇస్తుండగా.. జనవరి 6 ఒంగోలులో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అభిమానులు ఎంతో ఆశగా ఉన్నారు. ఒంగోలులో బాలకృష్ణ వీర సింహ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ మేకర్స్ పబ్లిసిటీ చేస్తున్నారు. 

పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు, నందమూరి అభిమానులు ఈ వేడుకకి హాజరు కావడానికి రెడీ అవుతున్నారు, కానీ ఇప్పుడు వీర సింహ రెడ్డి ఒంగోలు ఈవెంట్ క్యాన్సిల్ అయ్యేలా కనబడుతుంది. కారణం జగన్ గవర్నమెంట్ ఇంకా ఈ ఈవెంట్ కి సంబందించిన కొన్ని అనుమతులు ఇవ్వలేదు. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు రోడ్ షో జరుగుతున్న కందుకూరు, గుంటూరులో తొక్కిసలాట జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో జగన్ సర్కార్ రోడ్ షోలకకి, బహిరంగ సభలకు అనుమతులు రద్దు చేసింది. ఇరుకు ప్రదేశాల్లో జన సమీకరణ విషయంలో పలు ఆజ్ఞలు అమలు చేస్తుంది. 

అయితే వీర సింహ రెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్‌ వేదికపై అధికారుల నుంచి అనుమతి తీసుకున్న మేకర్స్.. ఈవెంట్‌కి వచ్చే అభిమానులు, అతిథుల వాహనాల పార్కింగ్ స్థలం విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయింది. దానితో ఒంగోలులో జరగబోయే వేదికని మార్చుకోవాలనే ఆలోచనలో వీర సింహ రెడ్డి టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. అది ఒంగోలు ABM గ్రౌండ్ నుండి మార్చి ఔట్స్ కట్స్ లోకి మారుస్తున్నట్లుగా తెలుస్తుంది.

AP government forces Veera Simha Reddy event to cancel:

Jagan forces Veera Simha Reddy to bite the dust

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ