Advertisementt

శ్రీకాళహస్తిలో అనసూయ స్పెషల్ పూజలు

Wed 04th Jan 2023 05:10 PM
anchor anasuya,srikalahasti  శ్రీకాళహస్తిలో అనసూయ స్పెషల్ పూజలు
Anasuya special pooja in Srikalahasti శ్రీకాళహస్తిలో అనసూయ స్పెషల్ పూజలు
Advertisement
Ads by CJ

జబర్దస్త్ నుండి బయటికి వెళ్ళాక అనసూయ హడావిడి సోషల్ మీడియాలో తప్ప ఛానల్స్ లోను, వెండితెర మీద పెద్దగా కనిపించడం లేదు. కొన్ని ప్రాజెక్ట్స్ తో అనసూయ బిజీగా వుంది అంటున్నా ఏడాదిగా అనసూయ షూటింగ్స్ లో పాల్గొంటున్నట్టుగా వినిపించడం లేదు, కనిపించడం లేదు. జబర్దస్త్ లో ఉన్నప్పుడు వారానికో ఫోటో షోతో హ్యాపీ గా కనిపించే అనసూయ ఇప్పుడు చాలా అరుదుగా కనబడుతుంది. జబర్దస్త్ నుండి తప్పుకున్నాక అమెరికాలో కొన్నాళ్ళు హడావిడి చేసింది.

అయితే సోషల్ మీడియాలో తనపై వచ్చే కామెంట్స్ కి ధీటుగా సమాధానం చెప్పే అనసూయ కొద్దిరోజులుగా పూజల్లో మునిగి తెలుస్తుంది. ఈమధ్యనే తన కుటుంబంలో హోమం చేసిన అనసూయ ఇప్పుడు శ్రీకాళహస్తిలో స్పెషల్ పూజలు చేస్తుంది. శ్రీకాళహస్తి లో ఈ రోజు బుధవారం ఉదయం అనసూయ ఒంటరిగా పూజలు చేసిన పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. శ్రీకాళహస్తి లో రాహుకేతు పూజలు ప్రత్యేకంగా జరుగుతాయి. దోష పరిహార పూజలు కూడా అక్కడ జరుగుతాయి.

మరి అనసూయ ఏ దోష పరిహార పూజలు చేయించుకుందో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ శ్రీకాళహస్తిలో పూజల తర్వాత హర హర మహాదేవ అంటూ సోషల్ మీడియాలో పిక్స్ తో పాటుగా షేర్ చేసింది.

Anasuya special pooja in Srikalahasti:

Anchor Anasuya Traditional Photos Viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ