రశ్మికపై ఎంత నెగిటివిటి ఉన్నా.. ఇప్పుడు ఒక్కసారిగా మహిళా అభిమానుల మనసులు గెలుచుకుంది ఆమె. కన్నడ ఇండస్ట్రీ లో రశ్మికపై సోషల్ మీడియాలో నెగిటివి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు రష్మిక సమంత అభిమానుల మనసుతో పాటుగా మహిళా హృదయాలను సైతం గెలుచుకుంది. కారణం సమంత మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతుంది. ఆమెని అమ్మలా చూసుకుంటానంటూ రష్మిక వారిసు ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమంత-రష్మిక ఫ్రెండ్స్. సమంత ప్రస్తుతం మాయోసైటిస్ వ్యాధితో పోరాటం చేస్తుంది. దానితో సమంత పై ఆమె అభిమానులకే కాదు, మహిళలందరూ సింపతీ చూపిస్తున్నారు.
ఇదే సమయంలో సమంతని అమ్మలా చూసుకుంటాను, ఆమె వెనుకే నిలబడతాను, కంటికి రెప్పలా కాపాడుతాను అంటూ రష్మిక సమంత ని సపోర్ట్ చెయ్యడం చూసిన లేడీ ఫాన్స్ రశ్మికని అకానికెత్తేస్తున్నారు. రష్మిక నువ్ పెద్ద స్టార్ వి అయ్యుండి అలా మాట్లాడడం నీ సంస్కారం. నువ్వు సమంతని చూడక్కర్లేదు, అందుకు ఆమె కుటుంబం ఉంది.. కానీ నువ్వన్న ఒక్క మాటతో నీ మనసు మాకు తెలిసింది. నువ్ గ్రేట్ అంటూ రశ్మికని పొగిడిన మహిళే కానీ, పొగడని మహిళ లేదు.
నువ్ వ్యాధిని నయం చెయ్యక్కర్లేదు, కానీ అంత సపోర్ట్ చేసి మాట్లాడావ్, నీ ఓదార్పుతో సమంత ఖచ్చితంగా కోలుకుంటుంది, మెడిసిన్ కన్నా ముఖ్యం ఓదార్పు, పలకరింపు ఇప్పుడు నువ్వు అదే చేసావ్ అంటూ రశ్మికని తెగ పొగిడేస్తున్నారు.