2022 కి గుడ్ బై అంటూ 2023 కి వెల్ కమ్ చెబుతూ గ్లామర్ గా బీచ్ లో భీబత్సం సృష్టించిన రకుల్ ప్రీత్ కొత్త ఏడాదిలో కూడా తగ్గేదేలే అంటుంది. న్యూ ఇయర్ వెకేషన్స్ కి థాయిలాండ్ చెక్కేసిన రకుల్ ప్రీత్ అక్కడ బీచ్ లో కేరింతలు కొడుతోంది. గత ఏడాది క్రిష్టమస్ అలాగే బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ బర్త్ డే వేడుకలని ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసిన రకుల్ ప్రీత్ నూతన సంవత్సర వేడుకలని బాయ్ ఫ్రెండ్ జాకీ తో జరుపుకున్న విషయాన్ని బయటపెట్టలేదు. కానీ బీచ్ లో బుల్లి బుల్లి ఫ్రాక్స్ తో ఇసుక తిన్నెల్లో సందడి చేస్తుంది. ఇక థాయిలాండ్ నుండి ముంబైకి మాత్రం బాయ్ ఫ్రెండ్ జాకీతోనే ఎయిర్ పోర్ట్ లో కనిపించింది రకుల్.
కొన్నేళ్లుగా క్లివేజ్ షో తో రకుల్ సోషల్ మీడియాని హీట్ పుట్టిస్తుంది. సినిమాల కన్నా సోషల్ మీడియాలో బిజీ బిజీగా ఉంటున్న రకుల్ ప్రీత్ ఈ ఏడాది బాయ్ ఫ్రెండ్ జాకీతో పెళ్లి పీటలెక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ రకుల్ మాత్రం పెళ్లి లేదు ఏమి లేదు.. ఇంకా కెరీర్ అంటుంది. కొన్నాళ్లుగా రకుల్ కి సినిమాలలో సక్సెస్ అన్నదే లేదు,. టాలీవుడ్ ఇప్పటికే రకుల్ ని పక్కనబెట్టింది. ఏదో హిందీ, తమిళ సినిమాలతో రకుల్ కాస్త బిజీగా కనిపిస్తుంది.