Advertisementt

విజయ్ తప్ప ఎవరూ కనిపించడం లేదా?

Tue 03rd Jan 2023 04:49 PM
dil raju,tollywood stars  విజయ్ తప్ప ఎవరూ కనిపించడం లేదా?
Dil Raju comments on Tollywood stars విజయ్ తప్ప ఎవరూ కనిపించడం లేదా?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ లో దిల్ రాజు ఒంటరివాడయ్యాడు అని అందరూ అనుకుంటున్నారు కానీ.. దిల్ రాజు కావాలనే అలా బిహేవ్ చేస్తున్నాడని ఇప్పుడు అందరికి అర్ధమవుతుంది. మొన్న కోలీవుడ్ లో విజయ్ పెద్ద హీరో అంటూ అజిత్ ఫాన్స్ ని కెలుక్కున్న దిల్ రాజు దానిని కవర్ చెయ్యడానికి నానా పాట్లు పడ్డాడు. ఒక హీరో కి నాలుగైదు సినిమాలకి వచ్చే రెవిన్యూని బట్టి పెద్ద హీరోని డిసైడ్ చేస్తామంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కొత్తగా విజయ్ లాంటి హీరోని ఇంతవరకు చూడలేదు. తెలుగులో సూపర్ స్టార్స్, మెగాస్టార్స్ తో పని చేశాను కానీ.. విజయ్ లా ఎవరూ లేరంటూ దిల్ రాజు టాలీవుడ్ హీరోలని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

దిల్ రాజు ప్రస్తుతం వారిసు ప్రమోషన్స్ లో భాగంగా..  నేను విజయ్ కోసం ఆయన క్యాబిన్ లో వెయిట్ చేస్తుండగా.. ఆయన డోర్ తీసుకుని లోపలికి వచ్చి రెండు కప్పుల కాఫీతో నిలబడి.. ఓ కప్ కాఫీ నా చేతికి ఇచ్చారు. ఒక స్టార్ హీరో వ్యవహరించిన తీరు నాకు సర్ ప్రైజింగ్ గా అనిపించింది. ఇప్పటికీ ఆ సీన్ నా మైండ్ లో అలా ఉండిపోయింది. నేను తెలుగులో స్టార్ హీరోలైన సూపర్ స్టార్స్ తోనూ, మెగాస్టార్స్ తోనూ సినిమాలు చేశాను. కానీ ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు. విజయ్ లాంటి హీరోని చూడలేదు అంటూ దిల్ రాజు మాటలు విజయ్ ఫాన్స్ కి ఆనందాన్ని కలిగించాయి.

కానీ దిల్ రాజు తెలుగులో చేసిన స్టార్ హీరోల ఫాన్స్ మాత్రం దిల్ రాజుపై ఫైర్ అవుతున్నారు. డబ్బు పెట్టుబడి పెట్టి సినిమాలు చేసి వారి ద్వారా సంపాదించుకుని.. ఈరోజు తెలుగులో విజయ్ లాంటి హీరో లేరంటావా అంటూ వారు దిల్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నీకు ఇప్పుడు విజయ్ తప్ప ఎవరూ కనిపించడం లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Dil Raju comments on Tollywood stars:

Dil Raju sensational comments on Tollywood super stars and megastars 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ