Advertisementt

చిన్నకూతురికి మెగాస్టార్ కాస్ట్లీ గిఫ్ట్

Tue 03rd Jan 2023 04:11 PM
chiranjeevi,sreeja  చిన్నకూతురికి మెగాస్టార్ కాస్ట్లీ గిఫ్ట్
Megastar Luxurious Gift To His Daughter Sreeja చిన్నకూతురికి మెగాస్టార్ కాస్ట్లీ గిఫ్ట్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిన్నకూతురు ప్రేమించినవాడితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు మెగా ఫ్యామిలీ బాధ వర్ణనాతీతం. పవన్ కళ్యాణ్ అయితే గన్ వేసుకుని తిరిగాడు, చిరంజీవి మౌనంగా రోధించారు. అలాంటి శ్రీజ భర్తని వదిలి కూతురితో పుట్టింటికి చేరితే.. ఆమెని చేరదీసి ప్రేమతో చూసుకుంటూ తన స్నేహితుల కొడుకు కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. రెండో పెళ్లి ని అయినా శ్రీజ నిలబెట్టుకుందా.. అంటే అదీ లేదు. కళ్యాణ్ దేవ్ తో కూడా విడిపోయింది.

భర్తకు విడాకులిచ్చిన బాధనుండి కోలుకునేందుకు కుటుంబ సభ్యులు శ్రీజని అపురూపంగా చూసుకున్నారు. అన్న రామ్ చరణ్ ఆమెని ముంబై, ఊటీ అంటూ తిప్పుకొచ్చాడు. శ్రీజ ఫ్యామిలీ సపోర్ట్ తో కళ్యాణ్ దేవ్ తో విడాకుల విషయాన్ని మరిచిపోయింది. ఇప్పుడు మెగాస్టార్ చిరు చిన్న కూతురు శ్రీజకి ఓ కాస్ట్లీ బహుమతి ఇచ్చినట్లుగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. 35 కోట్ల తో ఓ ఇంటిని శ్రీజకి గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే కాలనీలో సెకండ్ హ్యాండ్ ఇల్లుని చిరు కొని దానిని రెన్యువేట్ చేయించి మరీ కూతురికి బహుమతిగా ఇచ్చారని తెలుస్తుంది.

మరి 35 కోట్లతో ఇల్లు కొని గిఫ్ట్ ఇవ్వడం అంటే మెగాస్టార్ కి చిన్న విషయమే  కావొచ్చు, కానీ విన్నవారికి అది పెద్ద న్యూస్. మరి నిజంగా చిన్న కూతురు శ్రీజపై మెగాస్టార్ కి ఎంత ప్రేమో కదా! 

Megastar Luxurious Gift To His Daughter Sreeja:

Chiranjeevi Big Gift To Daughter Sreeja?

Tags:   CHIRANJEEVI, SREEJA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ