Advertisementt

పవన్-బాలయ్య ఫాన్స్ కి హోల్సేల్ షాక్

Tue 03rd Jan 2023 03:30 PM
unstoppable 2,pawan kalyan,nbk episode  పవన్-బాలయ్య ఫాన్స్ కి హోల్సేల్ షాక్
A wholesale shock for Pawan-Balayya fans పవన్-బాలయ్య ఫాన్స్ కి హోల్సేల్ షాక్
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమా షూటింగ్స్ అంటూ బిజీగా ఉంటూ ఫాన్స్ కి దూరంగా ఉంటున్నారు. సినిమాల ఈవెంట్స్ అప్పుడే అభిమానులకి కనిపిస్తారు. మిగతా సమయాల్లో ఆయన బిజీ. తాజాగా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఆహా అన్ స్టాపబుల్ షోకి వచ్చారు. బాలకృష్ణ షోకి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ లో పవన్-బాలయ్య అభిమానుల జాతరని ఛానల్స్ లో ప్రత్యక్షంగా చూసాం. జై పవన్, జై బాలయ్య , NBKwithPawan బ్యానర్ లతో హంగామా చెయ్యడంతో ఇప్పుడు ఆ ఎపిసోడ్ పై క్యూరియాసిటి, ఆత్రుత మరింతగా పెరిగిపోయాయి.

అయితే బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఈ సంక్రాంతికి స్పెషల్ ప్రీమియర్స్ గా స్ట్రీమింగ్ చేస్తారని ఫాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఆహా మాత్రం పవన్ ఫాన్స్ కి, బాలయ్య ఫాన్స్ కి హోల్సేల్ షాక్ ఇచ్చింది. కారణం పవన్-బాలయ్య ఎపిసోడ్ ఈ సంక్రాంతికి తీసుకురావడం లేదు. జనవరి 6న ప్రభాస్ బాహుబలి ఎపిసోడ్ 2, అలాగే సంక్రాంతికి ఎవరైనా కొత్త గెస్టులు రావొచ్చని అనుమానాలు రేకెత్తించారు. అంటే జనవరి 12 న బాలయ్య వీర సింహ రెడ్డి తో సరిపెట్టుకోమన్నారు. పవన్-బాలయ్య ఎపిసోడ్ కమింగ్ సూన్ అంటూ పోస్టర్ వేశారు.

దానితో సంక్రాంతికి బాలయ్య-పవన్ క్రేజీ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ రావడం లేదు అనేది తేలిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ సీజన్ 2 ముగింపు ఎపిసోడ్ గా ఫిబ్రవరిలో ప్రసారం చేస్తారేమో అంటున్నారు. ఈ విషయం తెలిసి పవన్ ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు.

A wholesale shock for Pawan-Balayya fans:

Unstoppable 2: Pawan Kalyan-NBK episode streaming on

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ