జబర్దస్త్ మాజీ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ కూకట్ పల్లిలో గత నెల మొదటివారం నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు టేక్ అవే ని ఎంతో గ్రాండ్ గా ఓపెనింగ్ చేసాడు. కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ని ఓపెన్ చెయ్యడమే తరువాయి అది ఒక్క దెబ్బకి ఫెమస్ అయ్యింది. కారణం కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు వెంట యూట్యూబ్ ఛానల్స్ పడ్డాయి. ఆ ఛానల్స్ ఇంటర్వ్యూలో కిచెన్ లో ఆర్పీ పని చేస్తూ చేపల పులుసు ఎలా వండుతున్నారో చెప్పడం, చేపలు ఎక్కడినుండి వస్తాయో చెప్పడం, యాంకర్స్ కి కడుపు నిండా చేపల పులుసులో భోజనం పెట్టడం వాళ్లేమో అబ్బో అంటూ తినడం వంటి వీడియోస్ తో ఈ చేపల పులుసు పాయింట్ తెగ ఫెమస్ అయ్యింది.
దానితో ఆర్పీ టేక్ అ వే కి జనాల తాకిడి ఎక్కువై చివరికి ఆర్పీ అక్కడ బౌన్సర్లు ని కూడా ఏర్పాటు చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఏరియా అంతా ట్రాఫిక్ జామ్ తో నిండిపోయి మిగతా వారికి ఇబ్బందిగా మారింది. అంతలా ఒక్కనెలకే ఫెమస్ అయిన నెల్లూరు పెద్ద రెడ్డి చేపల పులుసుని కిర్రాక్ ఆర్పీ మూసెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఆర్పీ మాత్రం తాకిడి ఎక్కువైంది. జనాలకు సరిపోయే చేపల పులుసుగా అందించలేకపోతున్నాం, అలాగే ట్రాఫిక్ జామ్ తో ఆ కర్రీ పాయింట్ దగ్గర తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎక్కడెక్కడినుండో చేపల పులుసు కోసం వచ్చేవారికి టైమ్ కి చేపల పులుసు అందించలేకపోతున్నాం.
అందుకే నెలరోజులకు షాప్ మూసేసాం. కిచెన్ కెపాసిటీ పెంచి, షాప్ కి మార్పులు చేసి, మళ్ళీ షాప్ ని ఓపెన్ చేద్దామనుకుంటున్నాం. దానికి సమయం పట్టేలా ఉంది. షాప్ బంద్ చేసిన విషయం తెలియక ఇంకా చేపల పులుసు కోసం వందలాదిమంది వస్తున్నారు. అందరికి క్షమాణాలు తెలియజేస్తున్నాను, అంతేకాకుండా నెల్లూరు చేపల పులుసుని బాగా వంటి మహిళలని నెల్లూరు నుండి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాం, త్వరలోనే అది జరుగుతుంది అంటూ ఆర్పీ చెబుతున్నాడు.