Advertisementt

NTR30 ఫస్ట్ షెడ్యూల్: భారీ యాక్షన్ సీక్వెన్స్

Mon 02nd Jan 2023 10:28 AM
ntr30,jr ntr,koratala  NTR30 ఫస్ట్ షెడ్యూల్: భారీ యాక్షన్ సీక్వెన్స్
NTR30 shooting update NTR30 ఫస్ట్ షెడ్యూల్: భారీ యాక్షన్ సీక్వెన్స్
Advertisement
Ads by CJ

NTR30 బిగ్ అప్ డేట్ ఇచ్చేసారు. న్యూ ఇయర్ రోజున ఎన్టీఆర్ ఫాన్స్  ని కూల్ చేసిన మేకర్స్ సినిమా విడుదల వచ్చే ఏడాది ఏప్రిల్ 5 అనేసరికి కాస్త డిస్పాయింట్ అయ్యారు. ఫిబ్రవరి నుండి NTR30 రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్నట్టుగా కూడా అప్ డేట్ ఇవ్వడంతో ఎన్టీఆర్ ఫాన్స్ కాస్త సంతోషపడుతున్నారు. NTR30 లో ఎన్టీఆర్ ని మాస్ లుక్ లోనే ప్రెజెంట్ చేయబోతున్నారని.. మరోసారి న్యూ ఇయర్ పోస్టర్ తో కన్ ఫర్మ్ చేసారు. ఫిబ్రవరిలో మొదలు కానున్న ఫస్ట్ షెడ్యూల్ కోసం అప్పుడే ఓ భారీ సెట్ ని సిద్ధం చేస్తున్నట్టుగా DOP రత్నవేలు చూపించారు.

రెగ్యులర్ షూటింగ్ మొదలు కాగానే మొదటి షెడ్యూ లో సముద్రం నేపథ్యంలో వచ్చే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దాని కోసమే సముద్రం సెట్ ని సిద్ధం చేస్తున్నారని, భారీగా బోట్స్ అలాగే ఓ షిప్ ని కూడా రూపొందించారని, ఈ యాక్షన్ సీక్వెన్స్ లో యంగ్ టైగర్ మాస్ లుక్ లో కనిపిస్తారని చెబుతున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఐదు భాషలను టార్గెట్ చేస్తున్న ఈ చిత్రం కోసం సంజయ్ దత్ ని విలన్ రోల్ కి సంప్రదిస్తున్నారనే టాక్ నడుస్తుంది.

అంతేకాకుండా ఈ చిత్రంలో నటించబోయే నటులలో ఎక్కువగా బాలీవుడ్ నటులకి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారనే న్యూస్ కూడా చక్కర్లు కొడుతోంది. ఇక NTR30 కోసం అనిరుద్ రవిచంద్రన్ ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేసాడు. కొరటాల శివ కూడా పూర్తి ఫోకస్ NTR30 పై పెట్టాడని, ఈసారి ఎన్టీఆర్ తో పాన్ ఇండియా హిట్ కొట్టి తన మీద ఉన్న రిమార్క్ చెరిపెయ్యాలని కొరటాల చూస్తున్నారు.

NTR30 shooting update:

NTR30 movie shooting update 

Tags:   NTR30, JR NTR, KORATALA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ