Advertisementt

చరణ్ అందరిలాంటి వాడు కాదు: చిరు

Sun 01st Jan 2023 04:29 PM
ram charan,chiranjeevi  చరణ్ అందరిలాంటి వాడు కాదు: చిరు
Chiranjeevi on Ram Charan చరణ్ అందరిలాంటి వాడు కాదు: చిరు
Advertisement
Ads by CJ

గత ఏడాది తమ ఫ్యామిలీకి సంతోషకరమైన సమయమని, ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ తర్వాత రామ్ చరణ్-ఉపాసన ఇంటికి వచ్చారు. ఉపాసన-చరణ్ తల్లితండ్రులవుతున్న విషయాన్ని చెప్పారు. దానికి మేము సంతోషించాం, ఉపాసన తల్లవుతున్న విషయం తెలిసి నాకు సురేఖకు కన్నీళ్లు వచ్చేసాయి. గత ఆరేళ్లుగా మేము ఈ శుభవార్తకోసం ఎదురు చూస్తున్నాము, ఉపాసనకు మూడో నెల వచ్చాకే మేము అందరితో పంచుకున్నామంటూ చిరు వాల్తేర్ వీరయ్య ఇంటర్వ్యూలో చెప్పారు.

అలాగే తాను న్యూ ఇయర్ కి అందరిలా పార్టీలు పబ్బులు అని ఎంజాయ్ చేసేవాడిని కాదని, తన ఏజ్ వాళ్లంతా న్యూ ఇయర్ పార్టీల కోసం వెళ్లినా తాను మాత్రం డిసెంబర్ 31 రాత్రి 11.30 నుండి 12 గంటల వరకు దేవుడి సన్నిధిలో కూర్చుని ఆంజనేయస్వామి దండకం చదువుతూ ఉంటాను, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ క్రాకర్స్ సౌండ్ వినగానే బయటికి వచ్చి నా కుటుంబానికి విషెస్ చెప్పేవాడిని.. ఇప్పటికి సురేఖ అదే పాటిస్తుంది అని చెప్పిన చిరు తన కొడుకు రామ్ చరణ్ కూడా తనలాగే తన ఫ్యామిలీని బలమని నమ్ముతాడు, కాకపోతే నేను ఓపెన్ గా ఉంటే చరణ్ గుంభనంగా ఉంటాడు.

అదే చరణ్ లోను నాలోనూ ఉండే తేడా అంటూ చిరు ఆ ఇంటర్వ్యూలో పర్సనల్ విషయాలను షేర్ చేసారు.

Chiranjeevi on Ram Charan:

Charan is not like everyone else: Chiranjeevi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ