పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు నుండి ఈ రోజు జనవరి 1 న న్యూ ఇయర్ సందర్భంగా క్రేజీ టీజర్ రిలీజ్ కాబోతుంది అంటూ కొంతకాలంగా ప్రచారం జరిగినా మేకర్స్ నుండి మాత్రం ఎలాంటి అప్ డేట్ రాలేదు. దానితో పవన్ కళ్యాణ్ ఫాన్స్ డిస్పాయింట్ అయ్యారు. కానీ నిర్మాత ఏఎం రత్నం ఖుషి రీ రిలీజ్ లో హడావిడి చెయ్యడమే కాదు, ఆయన హరి హర వీరమల్లు పై సూపర్ డూపర్ అప్ డేట్ ఇచ్చి ఫాన్స్ ని కుడా కూల్ చేసారు.
అది ఈనెల అంటే జనవరి 26 రిపబ్లిక్ డే రోజున హరి హర వీరమల్లు టీజర్ రిలీజ్ ఉండబోతున్నట్లుగా చెప్పారు. నిర్మాతే చెప్పాక ఇంకేముంది.. ఫాన్స్ కి పండగే. పవన్ కళ్యాణ్ వీరమల్లుగా లుక్ వైజ్ గా, యాక్షన్ పరంగా అదరగొట్టేస్తున్నారు. ఇంతకుముందే విడుదలైన లుక్, గ్లిమ్ప్స్ అన్నీ ఫాన్స్ ని ఆకట్టుకున్నాయి. క్రిష్ ప్రస్తుతం హరి హర వీరమల్లు యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. గత డిసెంబర్ లో వీరమల్లు 45 రోజుల లాంగ్ షెడ్యూల్ నిరవధికంగా షూట్ చేసారు.
ఈ షెడ్యూల్ నుండే ఈ రోజు టీజర్ రిలీజ్ అన్నప్పటికీ.. అది ఈ నెల 26 th కి మారింది. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బాబీ డియోల్ విలన్ రోల్ పోషిస్తున్నారు.