మెగాస్టార్ కి చిన్నల్లుడు అనాలో, మాజీ అల్లుడు అనాలో ఇంకా క్లారిటీ లేని కళ్యాణ్ దేవ్.. చిరు చిన్న కూతురు శ్రీజ తో విడిపోయి గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నాడు. శ్రీజని రెండో వివాహం చేసుకున్న కళ్యాణ్ దేవ్ ఓ పాప కూడా పుట్టాక ఆమెతో విడిపోయాడు. శ్రీజని పెళ్లి చేసుకున్నాక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా అదృష్టాన్ని చెక్ చేసుకుని.. శ్రీజతో విడిపోయాక సోషల్ మీడియాతో, జిమ్ లో కాలక్షేపం చేస్తున్న కళ్యాణ్ దేవ్.. పెట్టే పోస్ట్ లు ఒక్కోసారి ఎవ్వరికి అర్ధం కావు. రీసెంట్ గా కాస్త ఓపికపట్టండి.. అన్నిటీకి సమాధానం దొరుకుతుంది.. అంటూ పోస్ట్ పెట్టడం చూసి ఏం చెప్పబోతున్నాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూసారు.
అయితే 2023 న్యూ ఇయర్ కి వెల్ కమ్ చెబుతూ కళ్యాణ్ దేవ్ ఇన్స్టా పెద్ద పోస్ట్ పెట్టాడు. 2022 లో ఎన్నో నేర్చుకున్నాను, సహనంతో ఎలా ఉండాలో నేర్చుకున్నాను, ఎదగడం అంటే ఏమిటో తెలిసింది. ముఖ్యంగా అవకాశాలు అందుకోవడం, రిస్క్ తీసుకోవడం నేర్చుకున్నాను, నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నాను, ఇతరులని క్షమించడం, నాతొ నేను గడపడం వంటివి నేర్చుకున్నాను, మీ అందరి ప్రేమ నాపై ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను.
మీరు కుడా సంతోషంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.. మీ కళ్యాణ్ దేవ్ అంటూ కళ్యాణ్ దేవ్ ఇన్స్టా లో చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. తనతో తాను గడపడం అంటే శ్రీజతో దూరంగా ఉన్నాను అని కళ్యాణ్ దేవ్ చెప్పకనే చెప్పేసాడు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.