Advertisementt

ఊర మాస్ గా రణబీర్ యానిమల్

Sun 01st Jan 2023 10:10 AM
animal first look,ranbir kapoor  ఊర మాస్ గా రణబీర్ యానిమల్
Ranbir Kapoor Animal First Look ఊర మాస్ గా రణబీర్ యానిమల్
Advertisement
Ads by CJ

ఫస్ట్ ఫిలిం అర్జున్ రెడ్డి తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. ఆ సినిమాతో విజయ్ దేవరకొండ ని తిరుగులేని స్టార్ ని చేసాడు. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యాలని మహేష్-ప్రభాస్ లాంటి వాళ్ళకి కథలు చెప్పాడు. వారు కూడా సందీప్ తో సినిమా చెయ్యాలని ఉన్నా వాళ్లకున్న కమిట్మెంట్స్ తో సైలెంట్ అయ్యారు. ఈ లోపు బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో తన హిట్ మూవీ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో దుమ్మురేపాడు. బాలీవుడ్ లో ఫస్ట్ ఎటెంట్ తోనే స్ట్రాంగ్ గా తన మార్క్ చూపించాడు. దానితో సందీప్ రెడ్డికి ప్రభాస్ నుండి పిలుపొచ్చింది. ప్రభాస్ తో సినిమా కమిట్ చేయించి స్పిరిట్ అంటూ పోస్టర్ తో అధికారిక ప్రకటన ఇచ్చాడు. కానీ ప్రభాస్ ఎప్పుడు ఖాళీ అవుతాడో తెలియక సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ మొదలు పెట్టాడు.

గత ఏడాది బ్రహ్మాస్త్ర సినిమా డివైడ్ టాక్ తోనే కోట్లు కొల్లగొట్టిన రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి యానిమల్ షూటింగ్ తో బిజీగా వున్నాడు. మధ్యలో యానిమల్ నుండి కొన్ని వర్కింగ్ స్టిల్స్ లీకై సెన్సేషన్ క్రియేట్ చేసాయి. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా యానిమల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. సందీప్ రెడ్డి వంగా స్టైలిష్ అండ్ హ్యాండ్ సామ్ హీరో రణబీర్ ని ఊర మాస్ గా చూపించాడు. సిగరెట్ కలుస్తూ చేతిలో గొడ్డలితో వంటి నిండా రక్తంతో రణబీర్ కపూర్ లుక్ మాస్ ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్స్ చేసింది.

రణబీర్ యానిమల్ ఫస్ట్ లుక్ తో పాటుగా సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు మేకర్స్. ఆగష్టు 21 2023 న యానిమల్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ చిత్రంలో సౌత్ బ్యూటీ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.  

Ranbir Kapoor Animal First Look:

Animal first look: Ranbir Kapoor is ferocious

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ