కన్నడ లో హీరోయిన్ గా పరిచయమై సౌత్ లో టాప్ పొజిషన్ కి చేరిన రష్మిక మందన్న తన మొదటి సినిమా కిర్రాక్ పార్టీ అవకాశంపై ఆ నిర్మాణ సంస్థ, డైరెక్టర్ రిషబ్ శెట్టి గురించి కాస్త నెగటివ్ గా మట్లాడడమే కాకుండా ఇండియా వైడ్ గా దుమ్మురేపిన రిషబ్ శెట్టి కాంతార మూవీని చూడలేదు అంటూ చేసిన కామెంట్స్ తో రష్మికని కన్నడ అభిమానుల ఆగ్రహానికి గురి చేసాయి. ఈ మధ్యన రిషబ్ శెట్టి తో తత్సంబందాలు బాగానే ఉన్నాయి, కాంతార చూసాను అని వివరణ ఇచ్చింది. అప్పటికే రిషబ్ శెట్టి రశ్మికపై ఇండైరెక్ట్ సెటైర్లు వేస్తూ వచ్చాడు. అలాగే రశ్మికతో ఇక నటించేది లేదని కూడా చెప్పాడు.
తర్వాత రష్మిక వివరణ ఇచ్చాక ఆమెపై రిషబ్ శెట్టి కోపం పోయిందిలే అనుకున్నారు. కానీ రిషబ్ శెట్టికి ఆమెపై కోపం తగ్గలేదని అర్ధమవుతుంది. రిషబ్ శెట్టి దర్శకుడిగా, రక్షిత్ శెట్టి-రశ్మికలు జంటగా తెరకెక్కిన కిర్రాక్ పార్టీ విడుదలై ఆరేళ్ళు అయిన సందర్భంగా .. రిషబ్ శెట్టి ట్వీట్ చేస్తూ ఆరేళ్ళ క్రితం విడుదలైన కిర్రాక్ పార్టీని మీరు ఎంతగానో ఆదరించారు, థియేటర్స్ లో మీరు చేసిన సందడి, వేసిన విజిల్స్ అన్నీ చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. మిమ్మల్ని మరోసారి ఆ రోజుల్లోకి తీసుకు వెళుతున్నాను, ఈ సంతోషంలో, సెలెబ్రేషన్స్ లో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అంటూ ట్వీట్ చేసాడు.
రిషబ్ శెట్టి ట్వీట్ చేస్తూ కిర్రాక్ పార్టీ నిర్మాణ సంస్థ, అలాగే మ్యూజిక్ డైరెక్టర్, హీరోని టాగ్ చేసినప్పటికీ.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రశ్మికని టాగ్ చెయ్యకుండా వదిలెయ్యడంతో.. రశ్మికపై రిషబ్ కి ఇంకా కోపం పోలేదు.. ఆ కోల్డ్ వార్ అలానే ఉంది అని డిసైడ్ అవుతున్నారు కన్నడ అభిమానులు..