Advertisementt

నాకు పేరు రావడానికి పవన్ కల్యాణే కారణం

Sat 31st Dec 2022 12:02 PM
bandla ganesh,pawan kalyan  నాకు పేరు రావడానికి పవన్ కల్యాణే కారణం
Bandla Ganesh Comments on Pawan Kalyan నాకు పేరు రావడానికి పవన్ కల్యాణే కారణం
Advertisement
Ads by CJ

బండ్ల గణేష్, సోషల్ మీడియాలో ఈ పేరు ఎప్పుడూ సంచలనమే. కమెడియన్ గా గుర్తింపు పొంది.. సడన్ గా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడమే కాదు, అటు రాజకీయాల్లోకి వెళ్లి మళ్ళీ రాజకీయాలను వదిలేసి.. ప్రస్తుతం సినిమాలు చెయ్యక, ఖాళీగా ఉంటున్న బండ్ల గణేష్ తనకి పవన్ కళ్యాణ్ దేవుడు అని చెబుతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ వల్లే తాను ఈ పొజిషన్ లో ఉన్నానని ఎప్పుడూ చెప్పుకునే బండ్ల మరోసారి పవన్ నామ జపం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాల్సి ఉన్నా అది ఎప్పుడు మొదలవుతుందో తనకే తెలియని పరిస్థితి.

అయితే సినిమా ఇండస్ట్రీలో తనకి అవకాశాలు అతి సులువుగా రాలేదని, తానేమి పేరున్న కమెడియన్ కాదని చెబుతున్నాడు. ఈ వేషం బండ్ల గణేష్ మాత్రమే వెయ్యాలి అనే స్థాయిని తెచుకోలేకపోయిన నేను చెన్నైలో సినిమా ఆఫీస్ లు చుట్టూ తిరిగాను, నాకన్నా అందంగా, హైట్ ఎక్కువ ఉన్నవారికే అవకాశాలు రాలేదు. అలాగని ఢీలా పడకుండా అవకాశాలు ఇమ్మని ఎప్పటికప్పుడు అడిగే స్థాయిలోనే నేను ఉన్నాను అంటూ బండ్ల తన హిస్టరీ విప్పాడు. నేను డైరెక్టర్స్ దగ్గరకి వెళ్లి మీరు సూపర్, మీ బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ పొగుడుతూ అవకాశాలు అడుక్కునేవాడిని, వాళ్ళు చిన్న చిన్న వేషాలు ఇచ్ఛేవారు.

రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళాక కాలం కలిసొచ్చి నిర్మాతగా మారాను. కానీ నాకు ఇప్పుడు ఇంత పేరు రావడానికి మాత్రం పవన్ కళ్యాణ్ గారే కారణం అంటూ బండ్ల గణేష్ మరోసారి పవన్ కళ్యాణ్ ని దేవుడిని చేసేసాడు.

Bandla Ganesh Comments on Pawan Kalyan:

Bandla Ganesh Sensational Comments On Pawan Kalyan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ