Advertisementt

మహేష్-రాజమౌళి కాంబోపై క్రేజీ న్యూస్

Sat 31st Dec 2022 11:16 AM
rajamouli,mahesh babu,ssmb29  మహేష్-రాజమౌళి కాంబోపై క్రేజీ న్యూస్
Crazy news on Rajamouli-Mahesh combo మహేష్-రాజమౌళి కాంబోపై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు తో రాజమౌళి ఈ న్యూస్ వింటేనే మహేష్ ఫాన్స్ లో పూనకాలు, ఈ కాంబో సెట్ అయ్యింది.. త్వరలోనే పట్టాలెక్కబోతుంది, పాన్ వరల్డ్ మూవీగా రాజమౌళి దీన్ని ప్లాన్ చెయ్యడమే కాదు, గ్లోబల్ అడ్వెంచర్ గా ఉండబోతుంది అంటూ క్లూ ఇచ్చి వదిలారు. విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం మహేష్ తో చెయ్యబోయే కథపై కూర్చున్నారు. రాజమౌళి-మహేష్ కలయికపై ఎలాంటి న్యూస్ వినిపించినా అది రూమర్ అయినా సరే క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఈ మూవీపై క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

రాజమౌళి మహేష్ తో తెరకెక్కించబోయే సినిమాని బిగ్గెస్ట్ అడ్వెంచరస్ డ్రామా ని ఫ్రాంచైజ్ లా పలు భాగాలుగా చేయాలని చూస్తున్నారని, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తన టీమ్ తో ఈ పనిలో తలమునకలై ఉన్నారని అంటున్నారు. టాప్ డైరెక్టర్.. తన స్కిల్స్ తో అందమైన మహేష్ ని ఎలా మారుస్తారో.. ఎలా చూపిస్తారో అనే క్యూరియాసిటీని మరింతగా పెంచే న్యూస్ ఇది. ఈ న్యూస్ ని మహేష్ ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు.

ఇక మహేష్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ లో ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత మహేష్ హైదరాబాద్ కి వచ్చి జనవరి రెండో వారం నుండి త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న SSMB28 సెకండ్ షెడ్యూల్ లో పాల్గొంటారని తెలుస్తుంది.

Crazy news on Rajamouli-Mahesh combo:

Rajamouli-Mahesh combo update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ